Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

Viral News: నటుడు రామి రెడ్డి పేరు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోయినప్పటికీ పాత తరం ప్రేక్షకులకు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది. విలనిజానికి సరికొత్త అర్థం...

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..
Actor Ramireddy

Edited By: Sanjay Kasula

Updated on: Oct 24, 2021 | 8:32 AM

Viral News: నటుడు రామి రెడ్డి పేరు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోయినప్పటికీ పాత తరం ప్రేక్షకులకు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది. విలనిజానికి సరికొత్త అర్థం చెబుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అంకుశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన .. అంకుశం రామి రెడ్డి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన అంకుశం రామిరెడ్డి.. లివర్‌ సంబధిత వ్యాధితో 2011, ఏప్రిల్‌ 14న మరణించిన సంగతి తెలిసిందే.

ఆయన మరణించిన ఇన్నాళ్ల తర్వాత కూడా ఎందుకు గుర్తు చేసుకుంటున్నారనేదేగా మీ సందేహం. అసలు విషయమేంటంటే.. రాష్ట్రీయ జనతా దల్‌ పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ తన ట్విట్టర్‌లో నటుడు రామిరెడ్డి ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘మన హోం మంత్రి అమిత్‌షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారుతోంది.

ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అందులో కొందరు రామి రెడ్డిని గుర్తించి ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా రామిరెడ్డి పేరు ఇలా మరోసారి వెలుగులోకి వచ్చింది.

Also Read: NFL Recruitment: నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?

AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

Diwali 2021: దేశ వ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి.. ఈ పండగ విశిష్టత ఏమిటంటే..