దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ నటుడు అమిత్ పురోహిత్ ఇటీవలే మృతి చెందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ‘అమిత్ పురోహిత్ మరణం నన్నెంతో బాధించింది. ‘సమ్మోహనం’ సినిమాలో సమీరా మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ చాలా స్నేహంగా ఉండేవారు. ప్రతి షాట్‌కు 100 శాతం న్యాయం చేసేవాడు. నైపుణ్యం పుష్కలంగా కలిగిన మంచి యువ నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అతడి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నా’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా అమిత్ హిందీలో ‘పంక్’ (2010), ‘ఆలాప్’ (2012) వంటి సినిమాల్లో నటించారు. అయితే అమిత్ మృతి వెనక కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Saddened by the death news of Amit Purohit. He played Amit Malhotra (Sameera’s Ex Boyfriend) in Sammohanam. Very friendly guy & always gave 100 % for every shot. Another young and good actor left us too early. May his soul find peace. pic.twitter.com/uEh0bVBV87
— Sudheer Babu (@isudheerbabu) July 10, 2019