
మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా పెండ్సే తన వృత్తిపరమైన విషయాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ‘మే ఐ కమ్ ఇన్ మేడమ్?’, ‘భాబీజీ ఘర్ పర్ హై’ వంటి పాపులర్ హిందీ టీవీ సీరియళ్లతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నేహా, తెలుగు, తమిళ, మరాఠీ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో సొంతం చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. అయితే, 2020లో ఆమె చేసుకున్న వివాహం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి, చర్చకు దారితీసింది. నేహా పెండ్సే 2020 జనవరి 5న పూణేకు చెందిన వ్యాపారవేత్త శార్దూల్ సింగ్ వ్యాస్‌ను వివాహం చేసుకున్నారు. అయితే శార్దూల్‌కు ఇదివరకే రెండుసార్లు వివాహమై విడాకులు కావడం, అంతేకాకుండా ఆయనకు మొదటి ఇద్దరి భార్యల ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉండటంతో నెటిజన్లు నేహాను తీవ్రంగా ట్రోల్ చేశారు. రెండు విడాకులు అయిన వ్యక్తిని, ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోవడంపై ఆమెను సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఈ ట్రోలింగ్‌పై నేహా పెండ్సే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. “రెండు పెళ్లిళ్లు విఫలమైనప్పటికీ శార్దూల్ వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోకుండా మరోసారి భాగస్వామిని ఎంచుకోవడమే ఆయనలోని పాజిటివ్ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. గతంలో విడాకులు కావడం నేరం కాదు. నేటి కాలంలో పెళ్లికి ముందే ఎందరో డేటింగ్ చేసి విడిపోతుంటారు, కానీ శార్దూల్ చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని విడిపోయారు” అని నేహా స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
నేహా భర్త శార్దూల్ సింగ్ వ్యాస్ మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. సమాచారం ప్రకారం ఆయనకు దాదాపు 22 కంపెనీలు ఉన్నాయి. శార్దూల్ ఆస్తి విలువ బిలియన్ డాలర్లలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల పిన్న వయసులోనే ‘కెప్టెన్ హౌస్’ ధారావాహిక ద్వారా బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నేహా, ఇటు సీరియళ్లు, అటు సినిమాలు చేస్తూనే తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..