ఆ పాత్ర కోసం నాన్న సలహాలు తీసుకున్నా

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్‌.. తండ్రికి తగ్గ తనయగా పేరును సంపాదించుకుంది.

ఆ పాత్ర కోసం నాన్న సలహాలు తీసుకున్నా
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 8:25 AM

Shruti Haasan on Yaara movie: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్‌.. తండ్రికి తగ్గ తనయగా పేరును సంపాదించుకుంది. అయితే నటిగా మంచి స్టేజ్‌లో ఉన్నప్పటికీ.. ఇటీవల ఓ పాత్ర కోసం తన తండ్రి సలహాలను తీసుకుంటుందట ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు శ్రుతీ. విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా తెరకెక్కిన ‘యారా’లో శ్రుతీ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. 1970లో జరిగిన కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రుతీ, సుకన్య అనే పాత్రలో నటించింది.

దీనిపై మాట్లాడుతూ.. ‘’నా పాత్రల గురించి నాన్నతో పెద్దగా చర్చించను. ఏ పాత్ర అయినా నా స్టైల్‌లో చేయాలనుకుంటా. కానీ యారాలో సుకన్య పాత్ర ఎలా చేయాలో అర్థం కాలేదు. అందుకే వెంటనే నాన్నకు ఫోన్ చేసి సలహాలు తీసుకున్నా. మనకు పరిచయం లేని పాత్రల్లో నటించేటప్పుడు ఆ పాత్రను ముందుగా అర్థం చేసుకోవాలి. కట్టూ బొట్టూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పాత్ర గురించి తెలిసిన వాళ్లు ఇలా చేసింది ఏంటి అని అనుకోకుండా చేయాలి అని నాన్న సలహాలు ఇచ్చారు. అవి చాలా ఉపయోగపడ్డాయి. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు బాగానే చేసింది అన్నది కూడా పెద్ద ప్రశంసగాగే ఉంటుంది” అని శ్రుతీ పేర్కొన్నారు. కాగా యారా చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also: రాయలసీమ ఎత్తిపోతల పథకం.. ఏపీతో ఏకీభవించిన కేంద్రం

Latest Articles
ట్రైన్‌కి జీవిత కాలం ఎంతో తెలుసా? ఆ తర్వాత వాటిని ఎం చేస్తారంటే..
ట్రైన్‌కి జీవిత కాలం ఎంతో తెలుసా? ఆ తర్వాత వాటిని ఎం చేస్తారంటే..
30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..
30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్