సరిలేరు నీకెవ్వరు: ‘భారతి’గా విజయశాంతి.. అదరగొట్టేస్తున్న లుక్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మూవీ ద్వారా దాదాపు 13 సంవత్సరాల తరువాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. కాగా దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో కాస్త గర్వం, మరి కాస్త నవ్వుతో.. హుందా లుక్‌లో.. నాకు నేనే […]

సరిలేరు నీకెవ్వరు: 'భారతి'గా విజయశాంతి.. అదరగొట్టేస్తున్న లుక్
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2019 | 9:44 AM

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మూవీ ద్వారా దాదాపు 13 సంవత్సరాల తరువాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. కాగా దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో కాస్త గర్వం, మరి కాస్త నవ్వుతో.. హుందా లుక్‌లో.. నాకు నేనే సాటి అన్నట్లుగా అదరగొట్టేస్తోంది రాములమ్మ. చూస్తుంటే ఈ చిత్రం ద్వారా విజయశాంతి అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక ఈ మూవీ నుంచి ఇవాళ మరో ట్రీట్ కూడా ఉండబోతోంది. ఈ సాయంత్రం మహేష్‌కు చెందిన మరో లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బ్రహ్మాజీ, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కాబోతుంది. క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’పై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.