Gargi Movie: గార్గి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన సాయిపల్లవి.. సినిమా విడుదల ఎప్పుడంటే..

| Edited By: Ravi Kiran

Jul 03, 2022 | 6:54 AM

Sai Pallavi: విరాటపర్వంలో వెన్నెలగా మరోసారి ఆకట్టుకుంది సాయి పల్లవి (Gargi Movie). రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ న్యాచురల్‌ బ్యూటీ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి నటిస్తోన్న చిత్రం గార్గి (Gargi).

Gargi Movie: గార్గి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన సాయిపల్లవి.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Sai Pallavi
Follow us on

Sai Pallavi: విరాటపర్వంలో వెన్నెలగా మరోసారి ఆకట్టుకుంది సాయి పల్లవి (Gargi Movie). రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ న్యాచురల్‌ బ్యూటీ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి నటిస్తోన్న చిత్రం గార్గి (Gargi). గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల సాయి ప‌ల్లవి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, మేకింగ్ వీడియోల‌కు అభిమానుల మంచి స్పందన వచ్చింది. ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్‌అప్‌డేట్‌ వచ్చింది. జులైన 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్వయంగా సాయి పల్లవి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

కాగా ఈ చిత్రాన్ని త‌మిళంలో 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌పై కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య, జ్యోతిక విడుద‌ల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్నడ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు 96 ఫేం గోవింద్ వ‌సంత్ సంగీతం అందించారు. కాగా న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఆడపిల్లలను చులకనగా చూసే సమాజంలో ఒక ఆడపిల్ల.. తన హక్కుల కోసం పోరాటం చేసే కథగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు సినిమా పోస్టర్లు చూస్తే తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..