RRR Movie: అమెరికాను తాకిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ ప్రమోషన్స్‌.. ఏకంగా న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌పై..

|

Nov 27, 2021 | 9:27 PM

RRR Movie: యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. బాహుబలిలాంటి సంచలనం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా...

RRR Movie: అమెరికాను తాకిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ ప్రమోషన్స్‌.. ఏకంగా న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌పై..
Rrr Movie Promotion
Follow us on

RRR Movie: యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. బాహుబలిలాంటి సంచలనం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఆర్‌.ఆర్‌.ఆర్‌పై ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోయాయి. అత్యంత భారీ బడ్జెట్‌, తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఎట్టకేలకు సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన మూవీ యూనిట్‌ వచ్చే ఏడాది జనవరి 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా నెల రోజులకుపైగానే ఉన్నా సినిమా యూనిట్ చిత్ర ప్రమోషన్స్‌ను ప్రారంభించింది.

ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీమ్‌ సినిమా ప్రమోషన్స్‌లో మరో సరికొత్త పంథాను ఎంచుకుంది. ఏకంగా సినిమా ప్రమోషన్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా అమెరికాలో కూడా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా యూఎస్‌లో ఏకంగా 3000 స్క్రీన్లలో జనవరి 6నే సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యంలో భారీ ఎత్తున విడుదల చేస్తుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కేంద్రం టైమ్స్‌ స్క్వేర్‌లోని స్క్రీన్స్‌పై ఆర్‌.ఆర్‌.ఆర్‌ పోస్టర్‌లను ప్రదర్శించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇటు చెర్రీ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Also Read: AP Rain Alert: ఏపీకి మరో గండం.. 29న బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణశాఖ అలెర్ట్

Allu Arjun: బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? మల్టీ స్టారర్‌ చిత్రంతో ముంబయిలో పాగా వేయనున్నాడా..

Manchu Vishnu: ‘మా’ ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా మంచు విష్ణు.. పలు ఆస్పత్రులతో ఒప్పందాలు..