Prabhas: ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ? కుకింగ్ కోసం ఎంతమంది పనిచేస్తారంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం తన సినిమాలతోనే కాదు, షూటింగ్ సెట్స్‌లో ఇచ్చే అద్భుతమైన విందు భోజనాలు, అపారమైన ఆతిథ్యంతోనూ అందరి మనసులు గెలుచుకుంటారు. ప్రతిరోజూ తనతో పాటు చుట్టూ ఉన్న పదుల సంఖ్యలో సిబ్బందికి రకరకాల నాన్-వెజ్ వంటకాలను వడ్డించే ప్రభాస్, వారి భోజనం కోసం రోజుకు ఎంత ఖర్చు చేస్తారు.. ? అసలు ఎంత మంది వంట చేస్తారు ? అని విషయాలు తెలుసుకుందామా.

Prabhas: ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ? కుకింగ్ కోసం ఎంతమంది పనిచేస్తారంటే..
Prabhas

Updated on: Nov 10, 2026 | 9:39 PM

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం తన అభినయంతోనే కాకుండా, తన అద్భుతమైన ఆతిథ్యానికి, భోజన ప్రియత్వానికి కూడా ఎంతో పాపులర్ అయ్యారు. ప్రభాస్ షూటింగ్ సెట్స్‌లో ఉంటే చాలు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రకరకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి కుటుంబ ఆహారపు అలవాట్లు, ప్రభాస్ భోజన విశేషాలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఆహారపు అలవాట్లు, డైట్ సీక్రెట్స్ అలాగే వారి కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కృష్ణంరాజు గారికి, ప్రభాస్‌కు ఇద్దరికీ ఇంట్లో వండిన సాంప్రదాయ వంటకాలు అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా చేపల పులుసు అంటే అమితమని ఆమె తెలిపారు. షూటింగ్ స్పాట్‌లకు కృష్ణంరాజు గారి కోసం ప్రత్యేకంగా పెద్ద క్యారేజీలు పంపించేవారమని, అక్కడ అందరూ ఆ వంటకాల కోసం ఎంతగానో ఎదురుచూసేవారని శ్యామలా దేవి గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ డైట్‌లో ఉన్న సమయంలో ‘చీట్ డే’ రోజు ప్రత్యేకంగా చేపల పులుసు తయారు చేయించుకుని తింటారని ఆమె పేర్కొన్నారు. కృష్ణంరాజు గారు ఏ వంటకం చేసినా కేవలం వాసన చూసి ఉప్పు, కారాలు సరిగ్గా సరిపోయాయో లేదో కచ్చితంగా చెప్పేవారని, వంట చేయడం నలుగురికి తినిపించడం ఆయనకు ఎంతో ఇష్టమని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

కృష్ణంరాజు కుటుంబానికి సహజంగానే రాజసమైన ఆతిథ్య అలవాట్లు ఉన్నాయి. ముఖ్యంగా వారికి చేపల పులుసు, బిర్యానీ, నాన్-వెజ్ వంటకాలు అంటే ఎంతో ఇష్టం. కృష్ణంరాజు గారు స్వయంగా వంటలను పరిశీలించి, అతిథులకు ఏది ఇష్టమో తెలుసుకుని మరీ వడ్డించేవారని శ్యామలా దేవి గుర్తుచేసుకున్నారు. అదే సంప్రదాయాన్ని ప్రభాస్ కూడా కొనసాగిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ షూటింగ్ స్పాట్‌లో ఉన్నా తనతో పాటు చుట్టూ ఉన్న పది ఇరై మందికి తగ్గకుండా అందరికీ తన ఇంట్లోనే వండిన రుచికరమైన భోజనాన్ని పంపిస్తుంటారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

ప్రభాస్ కేవలం తాను తినడమే కాకుండా, తనతో పనిచేసే సిబ్బందికి, తోటి నటులకు విస్తృతమైన మెనూతో భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, వివిధ రకాల చేపల కూరలు, బిర్యానీలు ఇలా పలు రకాల వంటకాలు ప్రతిరోజూ సిద్ధమవుతుంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక వంట మనుషుల బృందమే పనిచేస్తుంది. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం, ప్రభాస్ షూటింగ్ సెట్స్‌లో అందరికీ కలిపి ఒక రోజు జరిగే భోజనం ఖర్చు సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని టాక్. ఇతరులకు కడుపు నిండా భోజనం పెట్టడంలో ఎప్పుడూ ముందుండే ప్రభాస్ మనస్తత్వం, ఆయన ఆతిథ్య గుణం ఇండస్ట్రీలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us