రానాకు సర్జరీ పూర్తి..?

| Edited By:

Jul 23, 2019 | 1:07 PM

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న రానా చికిత్స కోసం ఇటీవల విదేశాలకు వెల్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయనకు సర్జరీ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నెల 18న చికాగోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రానాకు శస్త్రచికిత్స పూర్తైందట. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మూడు నెలల తరువాత రానా యాక్షన్ సన్నివేశాలను మొదలు పెట్టనున్నాడని సన్నిహితుల నుంచి సమాచారం. కాగా రానా ప్రధాన పాత్రలో వేణు […]

రానాకు సర్జరీ పూర్తి..?
Follow us on

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న రానా చికిత్స కోసం ఇటీవల విదేశాలకు వెల్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయనకు సర్జరీ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నెల 18న చికాగోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రానాకు శస్త్రచికిత్స పూర్తైందట. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మూడు నెలల తరువాత రానా యాక్షన్ సన్నివేశాలను మొదలు పెట్టనున్నాడని సన్నిహితుల నుంచి సమాచారం.

కాగా రానా ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ‘విరాట పర్వం 1992’ ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. టబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ వేశారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంోల హిరణ్య కశ్యప సినిమాలో కూడా నటించనున్నాడు రానా.