RGV: ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు.. అరెస్ట్‌ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ..

| Edited By: Ram Naramaneni

Dec 02, 2024 | 10:03 PM

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను అరెస్ట్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ వచ్చిన వర్మ తాజాగా తన అరెస్ట్‌కు సంబంధించి బహిరంగంగా మాట్లాడారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కీలక విషయాలను పంచుకున్నారు..

RGV: ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు.. అరెస్ట్‌ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ..
Rgv
Follow us on

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అరెస్ట్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. వర్మను పోలీసులు అరెస్ట్‌ చేయబోతున్నారని. అందుకే వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వర్మ తాజాగా ఈ వార్తలపై స్పందించారు. తన అరెస్ట్‌ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆరోపణలు చేశారు.

వర్మపై కేసులు నమోదైన నేపథ్యంలో తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా నమోదు కావడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసులు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయనే అనుమానంతోనే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నానని తెలిపారు. మనది ఫ్రీ వరల్డ్ అన్న వర్మ, వ్యంగ్యం అనేది మీడియా సహా ప్రతి చోటా ఉంటుందన్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాను ఓపెన్ చేస్తే వందలాది మీమ్స్‌ కనిపిస్తాయన్న వర్మ.. తాను ఏడాది క్రితం చేసిన పోస్ట్ కూడా అలాంటిదేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఏడాది తర్వాత ఒక వ్యక్తి మేలుకుని తనపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడన్నారు. ఈ పోస్టును కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయని, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అనే అనుమానంతో నేను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నానని తెలిపారు. పోలీసులు ఇంతవరకు నను అరెస్ట్‌ చేస్తున్నట్లు కూడా ప్రకటించలేదన్న వర్మ.. ఇంతలో ఒక సెక్షన్ మీడియా సంస్థలు వర్మను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, వర్మ భయపడి పారిపోయాడని న్యూస్ టెలికాస్ట్ చేస్తూ వస్తున్నాయన్నారు.

ఇదే మీడియా సంస్థలు నాయకులతో పాటు ఇతరుల మీద అనే ప్రోగ్రామ్స్‌ చేస్తుంటాయన్న వర్మ.. మొదటి సారి పోలీసులు సంప్రదించినప్పుడు తాను అందుబాటులో లేనని, రెండోసారి కూడా ఇంకాస్త సమయం కావాలని అడిగానన్నారు. అయితే కావాలంటే వర్చువల్‌గా వీడియోలో మాట్లాడుతానని పోలీసులకు తెలిపినట్లు వర్మ తెలిపారు. ఇక తాను అప్లై చేసుకున్న ముందుస్తు బెయిల్ విషయంలో జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతోందని వర్మ చెప్పుకొచ్చారు. సెన్సార్‌ ఇబ్బందుల్లే తాను పొలిటికల్ మూవీస్ మానేస్తానని తెలిపినట్లు వర్మ చెప్పుకొచ్చారు.

తాను ఏదైనా పోస్ట్ చేస్తే తనను, తన ఫ్యామిలీని తిడుతూ వందల కామెంట్స్, మీమ్స్ వస్తాయన్న వర్మ.. పత్రికల్లో వచ్చే కార్టూన్స్ ఎవరో ఒక నాయకుడి మీద సెటైర్ వేసేవనని, ఇది దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందన్నారు. ఇక తాను చేసే పోస్ట్ లో అర్థం ఒక్కొక్కరికి ఒకలా కనిపించవచ్చని, అది ఎవరి వ్యక్తిగత దృష్టి కోణాన్ని బట్టి ఉంటుందన్నారు. తాను చేసిన తప్పేంటో, ఏ సెక్షన్ లో అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పకముందే కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేస్తున్నాయని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..