Prabhas: రాధేశ్యామ్ రిజల్ట్‌పై స్పందించిన ప్రభాస్‌.. అదే కారణమంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

| Edited By: Ravi Kiran

Apr 20, 2022 | 9:50 AM

Radheshyam: బాహుబలి సిరీస్‌ తో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas). ఆతర్వాత వచ్చిన సాహో దక్షిణాదిలో నిరాశపర్చినా బాలీవుడ్‌లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది

Prabhas: రాధేశ్యామ్ రిజల్ట్‌పై స్పందించిన ప్రభాస్‌.. అదే కారణమంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Prabhas
Follow us on

Radheshyam: బాహుబలి సిరీస్‌ తో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas). ఆతర్వాత వచ్చిన సాహో దక్షిణాదిలో నిరాశపర్చినా బాలీవుడ్‌లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌ (Radheshyam). పూజాహెగ్డే హీరోయిన్‌ గా నటించింది. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు. పీరియాడికల్‌ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. సినిమా మరీ క్లాస్‌గా ఉందని, ప్రభాస్ అభిమానులు ఆశించే మాస్‌ అంశాలు లేవని ఫ్యాన్స్‌ నిట్టూర్చారు. కాగా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన ప్రభాస్‌ రాధేశ్యామ్‌ ఫలితంపై స్పందించాడు.

‘బాహుబలి లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లోనే నటించడం వల్ల నటుడిగా నేను కొత్తదనం చూడలేను. విభిన్నమైన చిత్రాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న బడ్జెట్ చిత్రాల్లైనా పర్లేదు. ఇక రాధేశ్యామ్ విషయానికొస్తే.. ఆసినిమా విడుదల సమయానికి ఇంకా కొవిడ్ భయం పూర్తిగా తొలగిపోలేదు. సినిమా అపజయానికి ఇదొక కారణం అనుకుంటున్నా. ఇంకా నన్ను ప్రేమ కథల్లో చూడటానికి అభిమానులు ఇష్టపడి ఉండకపోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు డార్లింగ్‌. ఇక ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె తో పాటు మారుతి సినిమాలను లైన్‌లో పెట్టాడు డార్లింగ్‌.

Also Read:Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్‌ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!

Viral Video: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చి పక్కనే కుర్చున్న బస్సు డ్రైవర్.. చివరకు..

మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం