ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరపడుతోంది. ఆదిపురుష్ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. జూన్ 16న సినిమా విడుదల అవుతుండగా, 15వ తేదీ అర్థరాత్రి నుంచే ప్రీమియర్‌తో సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి.
విడుదలకు కొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానులు హంగామాను మొదలపెట్టేశారు. థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలులో ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఎమ్మిగనూరులో వినూత్నంగా సినిమాకు వెల్‌కమ్ చెప్పారు. 30 ఎద్దుల బండ్లపై ప్రభాస్ ఫొటో కటౌట్లతో భారీ ర్యాలీ చేపట్టారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆదిపురుష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే బైక్‌లపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఇక థియేటర్లలో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీటు ఆకర్షణగా నిలుస్తోంది. ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ కోరిక మేరకే చిత్ర నిర్మాతలు సినిమా విడుదలయ్యే ప్రతీ థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్లలో ఒక సీటుపై హనుమంతడి రూపంతో ఉన్న వస్త్రాన్ని ఏర్పాటు చేశారు.
మరన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..