Bheemla Nayak: నాకు అన్నం పెట్టింది ఈ సినిమానే.. భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో పవర్‌ స్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Feb 24, 2022 | 6:02 AM

Bheemla Nayak Pre Release Event: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం 'భీమ్లానాయక్‌'. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Bheemla Nayak: నాకు అన్నం పెట్టింది ఈ సినిమానే.. భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో పవర్‌ స్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pawan Kalyan
Follow us on

Bheemla Nayak Pre Release Event: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కే. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోండగా త్రివిక్రమ్‌, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘ చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులుండే ప్రాంతం. వారికి కులం, మతం, ప్రాంతం అనే తేడాలుండవు. ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చెన్నారెడ్డి లాంటి వారేందరో కృషి చేశారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సినీ రంగానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక సినిమా పరిశ్రమకు ఏ అవసరమున్నా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నారు. ఇక కేటీఆర్‌ను ఆప్యాయంగా రామ్‌ భాయ్‌ అని పిలుస్తుంటాను. ఆయనతో పాటు ఇక్కడకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’

ఎలా పడితే అలా సినిమాలు చేయను..
‘నేను ప్రజా జీవితంలో ఉన్నా కానీ, సినిమానే నాకు అన్నం పెట్టింది. ఈ సినిమానే ఇంత అభిమానులను నాకు భిక్షగా అందించింది. ఒకవేళ సినిమాల్లో లేకపోతే ప్రజాసేవలో కూడా ఉండేవాడిని కాదేమో. ఏదో అయిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. మన రాష్ట్రానికి, మనవాళ్లకు ఎంతో కొంత సేవ చేయాలని వచ్చాను. రాజకీయాల్లో ఉన్నా కదా అని ఎలా పడితే అలా సినిమాలు చేయట్లేదు. తొలిప్రేమ, ఖుషి ఎంతటి బాధ్యతతో చేశానో ఈ సినిమాకు అలాగే నిబద్ధతతో కలసి పనిచేశాం. టెక్నీషియన్లందరూ ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు. నా రాజకీయ కార్యక్రమాలకు అనుగుణంగా షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఏర్పాటుచేసినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. డైరెక్టర్‌ కే. చంద్రసాగర్‌ అమెరికాలో చదువుకుంటూ సినిమాపై ప్రేమతో ఇక్కడకు వచ్చారు. ఆయన సొంతూరు మన నల్గొండనే. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతున్న ఆయన మరిన్ని విజయాలు సాధించాలి. ఇక మొగిలయ్య, దుర్గవ్వ లాంటి జానపద గాయకులను వెలుగులోకి తెచ్చిన తమన్‌కు ధన్యవాదాలు’ అని పవన్‌కల్యాణ్  చెప్పుకొచ్చారు

Also Read: Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Andhra Pradesh: రష్యా-ఉక్రేయిన్ ఉద్రిక్తత.. కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఎందుకోసమంటే..

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..