Kamakshi: బయట కూడా అలాంటి అమ్మాయినే అనుకుంటున్నారు.. పొలిమేర హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

అయితే ఆ మైండ్ సెట్ మార్చుకోవాలని, యాక్టర్లను యాక్టర్లుగా చూడాలని కామాక్షి తెలిపింది.  లీడ్‌ క్యారెక్టర్‌ అనగానే ముంబాయి, ఢిల్లీకి ఫోన్‌ చేసేస్తారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగుమ్మాయిలకు ఇండస్ట్రీలో తగినంత న్యాయం జరగడం లేదన్న కామాక్షి.. తెలుగమ్మాయిలు వచ్చినా కూడా వాళ్లను సైడ్ క్యారెక్టర్లకే పరిమితం చేస్తున్నారని వాపోయింది. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు, సినిమాల్లో ఆ కష్టం కనిపిస్తుంది...

Kamakshi: బయట కూడా అలాంటి అమ్మాయినే అనుకుంటున్నారు.. పొలిమేర హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
Kamakshi
Follow us

|

Updated on: Jun 07, 2024 | 3:19 PM

పొలిమేర.. కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిస్తూనే మెప్పించింది. ఇక ఈ సినిమా ద్వారా నటిగా మంచి పేరు సంపాదించుకుంది తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల. అప్పటి వరకు కొందరికీ మాత్రమే తెలిసిన కామాక్షి ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో, తనదైన నటనతో మెప్పించిందీ చిన్నది.

ఇక ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన కామాక్షి ఎక్కువగా బోల్డ్‌ పాత్రలను పోషించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అందాల తార.. బోల్డ్‌ సన్నివేశాల గురించి స్పందించింది. బోల్డ్‌ కంటెంట్‌లో నటించదన్న కారణంతో అవకాశాలు ఇవ్వరన్న కామాక్షి.. సినిమాల్లో బోల్డ్‌గా నటిస్తే బయట కూడా అలాగే ఉంటారేమో అని తప్పుగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చింది. మొదట్లో సాఫ్ట్‌ పాత్రలో నటించి ఆ తర్వాత బోల్డ్‌ పాత్రలు చేస్తే మెచ్చుకుంటారు.. అదే మొదటి నుంచి బోల్డ్‌ పాత్రల్లో నటిస్తే మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటారని కామాక్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అయితే ఆ మైండ్ సెట్ మార్చుకోవాలని, యాక్టర్లను యాక్టర్లుగా చూడాలని కామాక్షి తెలిపింది.  లీడ్‌ క్యారెక్టర్‌ అనగానే ముంబాయి, ఢిల్లీకి ఫోన్‌ చేసేస్తారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగుమ్మాయిలకు ఇండస్ట్రీలో తగినంత న్యాయం జరగడం లేదన్న కామాక్షి.. తెలుగమ్మాయిలు వచ్చినా కూడా వాళ్లను సైడ్ క్యారెక్టర్లకే పరిమితం చేస్తున్నారని వాపోయింది. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు, సినిమాల్లో ఆ కష్టం కనిపిస్తుంది, ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేస్తాం అంటున్నారు అయినా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.

తన ప్రొఫైల్ చూసిన వారు గ్లామర్‌గా లేదంటూ కామెంట్స్‌ చేశారన్న కామాక్షి.. పర్ఫార్మ్ చేస్తున్నా కూడా గ్లామర్ గురించే మాట్లాడుతున్నారని వాపోయింది. యాక్టింగ్ చేయకపోతే చేయలేదని, చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని కామాక్షి ప్రశ్నించింది. కానీ తాను ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేశానని, ఇది ఒక్క రోజులో మారే విషయం కాదని చెప్పుకొచ్చింది కామాక్షి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..