
దృశ్యం సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో దృశ్యం సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆద్యుడు ఎవరంటే మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ వచ్చింది. గత నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది . తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ‘కలలో కనిపించేవన్నీ నిజమైతే’ అనే చిన్న పాయింట్ తో ఎంతో ఎంగేజింగ్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఓ 17 ఏళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ సాగుతుంది. తన కలలో వచ్చే ఓ ఆగంతక వ్యక్తి తనను రియల్‌గానే వెంబడిస్తున్నట్లు ఆమె ఫీల్ అవుతుంటుంది. అంతేకాదు ఆ వ్యక్తి తనను వెంటాడుతున్నట్లు, చంపాలని చూస్తున్నట్లు తరచూ కలలు వస్తుంటాయి. ఓ రోజు అనుకోకుండా తన కలలో కనిపించే పచ్చ కళ్లున్న వ్యక్తి తన ఇంటికే అతిథిగా వస్తాడు. దీంతో అమ్మాయి కంగారు పడుతుంది. తీవ్ర భయాందోళనకు గురవుతుంది. తల్లిదండ్రులు ఆమెను ఓ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళతారు.
మరి కలలో కనిపించిన వ్యక్తి ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి జీవితం ఏమైంది? అసలు ఆమె చదువుతున్న ఒక బుక్ కారణంగానే ఇదంతా జరుగుతుందా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఇంటికి వచ్చిన అతిథి ఎవరు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే. డైరెక్టర్ సుమేష్ నందకుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ పేరు రోస్లిన్. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో సీనియర్ నటీమణులు వినీత్ , మీనా భార్యాభర్తలుగా నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఊహించని సన్నివేశాలు,ఉహందని ట్విస్టులతో సాగే ఈ రోస్లిన్ వెబ్ సిరీస్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
#HotstarSpecials Secret Stories: Roslin is now streaming on JioHotstar.@jeethu4ever @ActressMeena_ #HotstarSpecials #Roslin #Trailer #Webseries #Thriller #Drama #JioHotstar #JioHotStarMalayalam #NowStreaming pic.twitter.com/SXC8QpBrQ9
— JioHotstar Malayalam (@JioHotstarMal) February 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.