OTT Movie: ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తోన్న తమిళ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. మొదటి రోజు నుంచే ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఇండియాతో సహా మొత్తం 12 దేశాల్లో ట్రెండింగ్ లో ఉండడం విశేషం.

OTT Movie: ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తోన్న తమిళ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Nov 11, 2026 | 9:55 PM

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి, అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కల్యాణం, దాయిరా, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, కికు చిరంజీవి, పరివారిక్ మనురంజన్ తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. స్ట్రీమింగ్ కు వచ్చిన రోజు నుంచే రికార్డు వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో 4.8 మిలియన్లు (48 లక్షల ) వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా, శ్రీలంక దేశాల్లో ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అలాగే మరో 10 దేశాల్లో టాప్ టాప్ 10 ట్రెండింగ్ మూవీగా నిలిచింది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగనీ ఇందులో పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ ఎక్స్ హంగులు, స్పెషల్ సాంగ్స్ గట్రా ఏమీ లేవు. అలాగే భారీ బడ్జెట్ సినిమా కూడా కాదు. కానీ కంటెంట్ తోనే కోట్లాది మంది మనసులను గెల్చుకుందీ సినిమా. ఇప్పటికీ ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 10కి 8.5 రేటింగ్ ఉండడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. మూవీ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ పీస్ అంటూ చూసిన వారందరూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా?

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు బత్తా. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. రెక్టర్ బాలాజీ తరణీధరన్ తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. విజయ్ సేతుపతికి భార్యగా జై భీమ్ నటి లిజోమోల్ జోస్ నటించింది. మాస్టర్ సాయి పృథ్విరాజ్ (శబరి), బేబీ సహస్ర శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. స్ట్రీమింగ్ అయిన మొదటి రోజు నుంచే ఈసినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఏకంగా 4.8 మిలియన్ల (48 లక్షలు) వ్యూస్ రాబట్టింది. ఇక రెండో వారంలో ఈ సినిమా ఇండియా, శ్రీలంక దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియా, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మాల్దీవులు, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సింగపూర్, యూఏఈ, మారిషస్ సహా మొత్తం 12 దేశాలలో టాప్ 10 ట్రెండింగ్ మూవీగా నిలిచింది.

చాలా మంది చెప్పినట్లు ఈ మూవీ నిజంగా ఓ మాస్టర్ పీస్.మరి మీరు ఈ బత్తా సినిమా చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి..

ఇవి కూడా చదవండి

విజయ్ సేతుపతి బత్తా సినిమా ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us