OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు

డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోని. ఇటీవల ఆయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. త‌మిళంలో ‘నూరు సామి’గా రిలీజైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది.

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు
Vanda Devullu Movie

Updated on: Aug 04, 2026 | 7:31 PM

‘బిచ్చ‌గాడు’(పిచ్చైకార‌ణ్‌) సినిమా విడుద‌లైన 10 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఆ సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా వంద దేవుళ్లు (తమిళంలో నూరు సామి). భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా ఇది తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం Zee5లో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ‘వంద దేవుళ్లు’ (నూరు సామి) చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రంలో భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథనం, ఆక‌ట్టుకునే నటన, సమకాలీన సామాజిక అంశాలను సున్నితంగా చూపించిన తీరు కోసం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విధవరాలైన తల్లి సెల్వి కథను ఆవిష్క‌రించింది. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత పిల్ల‌ల‌ను పెంచి పెద్ద చేసే క్ర‌మంలో జీవితాన్ని అంకితం చేసిన ఆమె.. పిల్ల‌లు పెరిగి పెద్ద‌యిన తర్వాత జీవితంలో తోడుగా ఎవరో కావాలనుకుంటుంది. అలాంటి స‌మ‌యంలో సమాజంలో వేర్లు ఊనుకున్న సాంప్రదాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వంద దేవుళ్లు’ మూవీ మాతృత్వం, గౌరవం, క‌ఠిన నిర్ణ‌యాల‌ను అంగీక‌రించే విధానం, సామాజికంగా ఎదురయ్యే స‌మ‌స్య‌లు, ధైర్యం వంటి అంశాల క‌ల‌యిక‌గా హృదయాన్ని కదిలించే కథగా తెర‌కెక్కించారు. సినిమా కథను గమనిస్తే.. సాంప్రదాయ ధోరణులను కొత్తగా ఆలోచింపజేసే తల్లి, కొడుకు బంధం తెలుస్తుంది. సాధారణంగా తల్లి త్యాగాలను మాత్రమే ప్రశంసించే కథలకంటే భిన్నంగా, ‘వంద దేవుళ్లు’ (నూరు సామి)లో తన తల్లికి అండగా నిలబడి ఆమె జీవితం సంతోషంగా ఉండటానికి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్రోత్సహించే కొడుకు ఎలా ఉంటాడ‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. హృదయాన్ని తాకే భావోద్వేగాలను అర్థవంతమైన సామాజిక సందేశంతో కలిపి ఈ చిత్రం అన్నీ వ‌ర్గాల వారికి చేరువయ్యేలా రూపొందించ‌బ‌డింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శ‌శి మాట్లాడుతూ ‘‘‘వంద దేవుళ్లు’ (నూరు సామి) అనేది నిజమైన భావోద్వేగాలు, నిజ జీవితాల నుంచి పుట్టిన కథ. వయస్సు లేదా సమాజపు ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా కూడా ఒక మ‌హిళ త‌న‌ ప్రేమ, అంగీకారం, సంతోషాన్ని ఎంచుకునే స్వేచ్ఛ గురించి చెప్పే కథను చెప్పాలని అనుకున్నాను. థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. ఇప్పుడు తమిళ Zee5 ద్వారా మరింతగా ప్రేక్ష‌కుల‌కు చేరువ కానుండ‌టం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ ‘‘ప్రతి సినిమాకీ ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ‘వంద దేవుళ్లు’ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో ఉన్న భావోద్వేగాలు చాలా లోతైనవి. ఈ కథలో తల్లి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రధానంగా నిలుస్తుంది. సినిమాలో ఉన్న సందేశంతో ప్రేక్షకులు గాఢంగా బ‌లంగా క‌నెక్ట్ అవుతార‌ని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వివిధ భాషల్లో కుటుంబాలంతా కలిసి ఈ సినిమాను Zee5లో చూసే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు. ఆగ‌స్ట్ 7న ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ ‘వంద దేవుళ్లు’ (నూరు సామి) సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా వీక్షించ‌టానికి జీ5ను ట్యూన్ చేసుకోండి.

వంద దేవుళ్లు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us