OTT Movies: వినాయక చవితి స్పెషల్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే.. ఈ రెండు చిత్రాలు అసలు మిస్ అవ్వొద్దు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ వారం థియేటర్లు, ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ సందడి చేయనున్నాయి. హనుమాన్ అంశ్, ఇరుముడి లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి.
ఈ వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న ఈ చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా ‘418’, కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఓవరాల్ గా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఇరుముడి’. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు మొదటి రాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ద డాల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
మాన్‌స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
ఇరుముడి (తెలుగు సినిమా) – సెప్టెంబరు 18
లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 18
బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18
మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18
ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 19
స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 20
అమెజాన్ ప్రైమ్ వీడియో
ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 15 (రెంట్)
నీగ్లే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
వెయిటింగ్ హై (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) – సెప్టెంబరు 18
యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 18
జియో హాట్‌స్టార్
78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) – సెప్టెంబరు 15
లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 17
తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18
మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19
సన్ నెక్స్ట్
అంగీకారం (తమిళ సినిమా) – సెప్టెంబరు 18
ఆపిల్ టీవీ ప్లస్
స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.