Operation Alamelamma OTT: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌.. సైతాన్ నటుడి మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

2017లో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన కన్నడ సినిమా ఆపరేషన్‌ అలమేలమ్మ. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌కు జోడీగా సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రిషి నటించాడు. ఇప్పుడీ ఆపరేషన్ అలమేలమ్మ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌..

Operation Alamelamma OTT: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌.. సైతాన్ నటుడి మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
Operation Alamelamma Movie

Updated on: Oct 29, 2023 | 9:02 AM

జెర్సీ సినిమాలో చక్కని అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఆ తర్వాత జోడి, శ్రీకృష్ణ అండ్‌ హిజ్‌ లీలీ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైందీ అందాల తార. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూనే ఓటీటీల్లోనూ అదరగొడుతోంది శ్రద్ధా. త్వరలోనే విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌ సినిమాతో మన ముందుకు రానుంది. కాగా 2017లో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన కన్నడ సినిమా ఆపరేషన్‌ అలమేలమ్మ. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌కు జోడీగా సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రిషి నటించాడు. ఇప్పుడీ ఆపరేషన్ అలమేలమ్మ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘రేషన్‌ లో ఇస్తారు షుగర్‌. ఆపరేషన్‌ అలమేలమ్మ బెస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌’ అని తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది ఆహా ఓటీటీ.

కిడ్నాప్ డ్రామాతో మొదలై..

సునీల్‌ తెరకెక్కించిన ఆపరేషన్‌ అలమేలమ్మ సినిమాలో రాజేష్‌ నటరంగ, అరుణ్‌ బాలాజీ, షీలమ్‌, విశ్వవిజేత్‌, ధీరజ్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్‌ సినిమాస్‌ స్టార్‌ ఫ్యాబ్‌ బానర్‌పై అమ్రేజ్‌ సూర్యవంశీ సునీల్‌ ఈ సిమాను నిర్మించారు. జుధాహ్‌ సంధీ సంగీతం అందించారు. కథ బాగుండడంతో కేజీఎఫ్‌ ఫేమ్‌ హోంబలే ఫిల్మ్స్‌ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయడం విశేషం. ఇక సినిమా కథ విషయానికొస్తే.. డ‌బ్బుపై మోజుతో ప‌ర‌మేష్ అనే అనాథ యువ‌కుడు ఒక బిజినెస్‌మెన్ కొడుకును అపహరిస్తాడు. అయితే ఇదే అతనిని ఇరకాటంలో పడేస్తుంది. మరి కిడ్నాప్‌ వ్యవహారంతో పరమేష్‌ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? కిడ్నాప్‌ డ్రామాతో అనన్య అనే స్కూల్‌ టీచర్‌కు సంబంధమేంటో తెలుసుకోవాలంటే ఆపరేషన్‌ అలమేలమ్మ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

కడుపుబ్బా నవ్వించే సస్పెన్స్ థ్రిల్లర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us