AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie OTT: ఓటీటీలోకి వస్తున్న పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా..

Peddi Movie OTT: ఓటీటీలోకి వస్తున్న పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Peddi Movie
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2026 | 12:37 PM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు, సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో భారీ వసూళ్లతో అంచనాలను అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా జూలై 09 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే (దాదాపు 5 వారాల థియేట్రికల్ విండో పూర్తి చేసుకొని) ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్ పైకి రావడం విశేషం. సౌత్ ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. త్వరలోనే హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, రవికిషన్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ముఖ్యంగా ‘చికరి చికరి’ సాంగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ 1980ల నాటి గ్రామీణ నేపథ్యం చుట్టూ తిరుగుతుంది. డబ్బు కోసం ఏ టీమ్ కైనా ఆడే ఒక స్వార్థపరుడైన క్రికెటర్ జీవితం, అప్పలాసూరి అనే వ్యక్తిని కలిశాక ఎలా మారిందనేది ప్రధానాంశం. తన గ్రామానికి రైల్వే హాల్ట్, అధికారిక గుర్తింపు తీసుకురావడం కోసం పోరాడే గ్రామస్థుల పక్షాన నిలబడి, తన పహిల్వాన్ గురువు గౌరనాయుడు మార్గదర్శకత్వంలో ఆ క్రికెటర్ ఎలా ఒక నిజమైన క్రీడాకారుడిగా, త్యాగశీలిగా మారాడనేది బుచ్చిబాబు సన అద్భుతంగా తెరకెక్కించారు. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారు జూలై 09 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

పెద్ది స్ట్రీమింగ్ డేట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే