
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్- దర్శకుడు నెల్సన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘జైలర్ 2’. గతంలో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ‘జైలర్ 2’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కనీవిని ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. రజనీకాంత్ కెరీర్ లోనే కాదు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా జైలర్ 2 రికార్డుల కెక్కింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సుమారు రూ. 830 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ స్టైల్, స్వాగ్, యాక్షన్ సీక్వె్స్, నెల్సన్ డైరెక్షన్ అన్నిటికీ మించి అనిరుధ్ బీజీఎమ్ జైలర్ 2 సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి. కాగా తమిళనాడులో ఇప్పటికీ చాలా చోట్ల జైలర్ 2 సినిమా థియేటర్లలో ఆడుతోంది. బుధవారం (నవంబర్ 11) ఈ సినిమాకు బుక్ మై షోలో 7 వేలకు పైగా టికెట్లు బుక్ అవ్వడం విశేషం. అయితే ఇంతలోనే జైలర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 12 నుంచే రజనీ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తామని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే జైలర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేసింది.
కాగా జైలర్ 2 మూవీ అన్ కట్ వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. థియేటర్ వర్షన్ కంటే కూడా 30 నిమిషాల ఎక్స్ ట్రా ఫుటేజీని యాడ్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ చివరకు సేమ్ థియేటర్ వర్షన్ తో జైలర్ 2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన జైలర్ 2 సినిమాలో చాలా మంది స్టార్స్ యాక్ట్ ఉన్నారు. రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్, రిత్విక్, మేఘనా రాజ్.. ఇలా ఎంతో మంది స్టార్స్ వివిధ పాత్రలు పోషించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి