
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఏప్రిల్ 10) కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. అలా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాల్లో ఒక తమిళ బ్లాక్ బస్టర్ కూడా ఉంది. అయితే ఇది కమర్షియల్ సినిమా కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేవు. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ ఎక్స్ హంగులు, స్పెషల్ సాంగులు గట్రా కూడా లేవు. పైగా లో బడ్జెట్. అయినా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 10 కోట్ల తో రూపొందిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. గత నెల ఫిబ్రవరి 27న థియేటర్లలో ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోయినా ఓటీటీలో మాత్రం తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కథ అంతా పావునుతాయ్అనే ఓ 70 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఊరిలో ఆమె ఒక కరుడు గట్టిన వడ్డీ వ్యాపారి. అంటే ఇచ్చిన వడ్డీ డబ్బులను ముక్కు పిండి వసూలు చేసే రకం. ఇంట్లో ముగ్గురు కొడుకులు, కోడళ్లు కూడా ఆమె మాట వినాల్సిందే. ఊళ్లో వారందరికీ అప్పులిచ్చి వడ్డీ డబ్బూలు వసూలు చేసుకునే ఆమె సడెన్ గా పక్షవాతం బారిన పడుతుంది. కదల్లేక పూర్తిగా మంచానికే పరిమితమైపోతుంది.
పావునుతాయ్ పరిస్థితిని చూసి ఆ ఊరి జనమంతా ఆమె ఎప్పుడు చనిపోతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరోవైపు ఆమె కొడుకులు కూడా ఆస్తి ఎక్కడ ఉందో కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కదల్లేని స్థితిలో ఆ వృద్ధురాలు తరచూ సైగలు చేస్తూ ఏదో రహస్యం చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆమెను ఎవరూ అర్థం చేసుకోరు. ఇదే సమయంలో ఒక వ్యక్తి వృద్ధురాలి దగ్గరకు వచ్చి 160 తులాల బంగారం గురించి అడుగుతాడు. అంతే అందరూ షాక్ అవుతారు. మరి బంగారం కోసం పవునుతాయి ముగ్గురు కొడుకులు, అల్లుడు ఏం చేశారు? తల్లి దాచిన బంగారాన్ని ఎలా కనిపెట్టారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే కన్నీళ్లు పెట్టించే ఈ ఎమోషనల్ మూవీ పేరు ‘తాయ్ కిళవి’. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాను నిర్మించడం మరో విశేషం. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళంతో పాటు తెలుగులో వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Rendu idly’ku porandha paiyan 😂😂#ThaaiKizhavi now streaming only on #JioHotstar #ThaaiKizhaviOnJioHotstar #ThaaiKizhaviNowStreaming #JioHotstarTamil @Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl @PassionStudios_ @realradikaa @Dir_SivakumarM @nivaskprasanna… pic.twitter.com/UUMRqH7xbC
— JioHotstar Tamil (@JioHotstartam) April 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.