Kali OTT: ఓటీటీలో సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు మాములుగా ఉండవు.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Oct 13, 2024 | 8:29 PM

యంగ్ హీరోలు ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య కలిసి నటించిన సినిమా కలి. శివ శేషు తెరకెక్కించిన ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలోనేహా కృష్ణన్, మణిచందన, మధుమణి, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది.

Kali OTT: ఓటీటీలో సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు మాములుగా ఉండవు.. ఎక్కడ చూడొచ్చంటే?
Kali Movie
Follow us on

యంగ్ హీరోలు ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య కలిసి నటించిన సినిమా కలి. శివ శేషు తెరకెక్కించిన ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలోనేహా కృష్ణన్, మణిచందన, మధుమణి, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది. ఆత్మహత్యల నేపథ్యంలో తెరకెక్కిన కలి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే బరిలో దేవర లాంటి సినిమాలు ఉండడంతో జనాలకు ఎక్కువగా రీచ్ కాలేకపోయింది. దీంతో ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే వచ్చాయి. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకున్న కలి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కలి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అక్టోబర్ 17 నుంచే కలి సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈటీవీ విన్. అలాగే ‘థ్రిల్లర్‌ అలర్ట్‌’ అంటూ కలి సినిమా పోస్టర్‌ ను కూడా పంచుకుంది.

ప్రముఖ కథా రచయిత కె. రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కలి మూవీని నిర్మించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. ఇక కలి సినిమా కథ విషయానికి వస్తే.. పురాణాల్లోని కలి పురుషుడి పాత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. శివరామ్‌ (ప్రిన్స్‌) అనే వ్యక్తి తన మంచితనం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికొచ్చిన అతడి జీవితంలో.. అపరిచిత వ్యక్తి (నరేశ్‌) రాక వల్ల వచ్చిన మార్పులేంటి? అనే ఆసక్తికర అంశాలతో కలి సినిమా తెరకెక్కింది.

ఇవి కూడా చదవండి

మరో నాలుగు రోజుల్లో ఈటీవీ విన్ లో  కలి సినిమా

కలి సినిమా  ట్రైలర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..