
లవ్ టుడే, డ్యూడ్, డ్రాగన్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్‌ఐకే). నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ డ్రామాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి డీసెంట్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రదీప్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎల్‌ఐకే సినిమా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా లవ్, బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడని రివ్యూలు వచ్చాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న కామెంట్స్ వినిపించాయి.
థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ( మే 06) అర్ధ రాత్రి నుంచే ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఎల్ఐకే సినిమాలో యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.
LOVE IN 2040 IS NOW ON YOUR SCREEN! 🚀🤖#LoveInsuranceKompany premieres on @PrimeVideoIN on May 6! 🔥 Experience @pradeeponelife & @iam_SJSuryah ‘s clash in 5 languages 🌍📱
Ready to check your Love Score? 📈💔#LIK #PradeepRanganathan #Anirudh #KrithiShetty pic.twitter.com/0qBDime757
— tamilcinemaa (@tamilcinemaa29) May 5, 2026
#LIK #LoveInsuranceKompany Now Streaming On #primevideo
🔊𝗔𝘂𝗱𝗶𝗼𝘀 : Tamil | Telugu | Hindi | Malayalam | Kannada pic.twitter.com/mF0YU1Nm0r
— Ott Movie Update (@ottmovieupdate) May 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.