
ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ ను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతుంది. ఆ సినిమా పేరు మేడ్ ఇన్ కొరియా. స్టార్ హీరో లేకపోయినా.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓజీ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‌గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..
ఆమె చేసిన మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ సినిమా మార్చి 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్త కాన్సెప్ట్.. సాఫ్ట్ గా సాగిపోయే కథ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ పేరు మారుమోగుతుంది. అలాగే ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..
కథ విషయానికి వస్తే.. షెన్బా (ప్రియాంక మోహన్) తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ఉండే అమ్మాయి. చిన్నప్పుడు స్కూల్లో వేసిన ఓ నాటకం తర్వాత ఆమె కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్, కొరియా అంటే విపరీతమైన ఇష్టం పెరుగుతుంది. ఎలాగైనా కొరియా వెళ్లాలని చిన్నప్పటి నుంచే కొరియన్ భాష నేర్చుకుంటుంది. అయితే తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తన ప్రియుడితో కలిసి కొరియా వెళ్లాలనుకుంటుంది. కానీ చివరి నిమిషంలో అతడు మోసం చేస్తాడు. దీంతో ఒంటరిగానే కొరియాలోని సియోల్ సిటీకి వెళ్తుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది.. ? తన జీవితంలోకి పార్క్ హే జిన్ ఎలా వచ్చాడు? అనేది సినిమా.
ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..
ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‌లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..