
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరో నవీన్ పొలిశెట్టి. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నారు. మొదట్లో చిన్న చిన్న చిత్రాలతో అలరించిన నవీన్.. జాతిరత్నాలు సినిమాతో హిట్టు అందుకున్నాడు.ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ త్రవాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో అలరించాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా.. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ సైతం హైలెట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నవీన్ యాక్టింగ్ గురించి చెప్పక్క్రర్లేదు. ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్, పంచులు, నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉంటే.. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. అయితే మొన్నటి వరకు నెట్టింట వినిపించిన రూమర్స్ కంటే ముందే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
కథ విషయానికి వస్తే.. గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి ) . కేవలం పేరుకు మాత్రమే జమీందారు. కానీ చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తన స్నేహితుడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో.. తాను కూడా డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు (రావు రమేశ్) ధనవంతుడు అని తెలుసుకుని అతడి కూతురు చారులత (మీనాక్షి చౌదరి) ప్రేమలో పడేస్తాడు. పెళ్లి తర్వాత మొదటి రోజు రాజుకు ఓ విషయం తెలుస్తుంది. తర్వాత అతడి లైఫ్ ఎలా మారింది అనేది సినిమా.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..