
‘సేనాపతి’, ‘మాయాబజార్ ఫర్ సేల్’, ‘గుర్రం పాపిరెడ్డి’, ‘వికటకవి’, ‘పరువు’ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నరేశ్ అగస్త్య. ముఖ్యంగా ఈ మధ్యన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఎక్కువగా నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆడియెన్స్ కూడా ఈ నటుడి సినిమాలు, సిరీస్ లను తెగ చూసేస్తున్నారు. అలా ఓటీటీ ఆడియెన్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ తో మన ముందుకు వచ్చాడు నరేష్ ఆగస్త్య. అదే రుద్రవరం పీఎస్. శశిధర్ మున్నంగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ అందర దృష్టిని ఆకర్షిస్తోంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో ఎస్ఐ శివకుమార్‌గా పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రుద్రవరం పీఎస్’ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 1.42 నిమిషాల పాటు ఉన్న ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింద. ఇందులోని సన్నివేశాలు కూడా ఉత్కంఠ రేపేలా ఉన్నాయి. అలాగే ‘క్రైమ్ ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది. అదే క్రిమినల్ ను ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది’ అన్న డైలాగులు సిరీస్ పై ఇంట్రెస్ట్ ను పెంచేస్తున్నాయి.
ఈ కథ అంతా ‘రుద్రవనం’ అనే ఒక మారుమూల గ్రామం, అక్కడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఒక వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమవుతాడు. అదే సమయంలో ఎవరిదో తెలియని ఒక ‘తల లేని మొండెం’ లభ్యమవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్ఐ శివకుమార్ కు అప్పగిస్తారు. అయితే విచారణలో ఆ ఊరిలో పలు మిస్టరీ సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. స్థానిక రాజకీయాలు, అవినీతి నెట్వర్క్, ఎన్నో ఏళ్లుగా పూడ్చిపెట్టిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మరి ఆ తల లేని మొండెం ఎవరిది? మాయమైన వ్యక్తికి, ఈ మర్డర్‌కి ఉన్న లింక్ ఏంటి? అసలు ఆ ఊరి పెద్దలు దాస్తున్న సీక్రెట్స్ ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.