OTT Movie: అర్ధరాత్రి అమ్మాయిలను హత్య చేసే సైకో.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీలో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాలో ట్విస్టులు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి.

OTT Movie: అర్ధరాత్రి అమ్మాయిలను హత్య చేసే సైకో.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Nov 17, 2026 | 9:43 PM

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆడియెన్స్ ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు భారీగా వ్యూయర్ షిప్ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. థియేటర్లలో ఈ సినిమా ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఇందులో వచ్చే ట్విస్టులు కూడా ఎవరూ ఊహించలేరు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. హైదరాబాద్‌లో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి ఆమెపై దాడి చేసి ఓ రేర్ డ్రగ్ ఆమెకు ఇంజెక్ట్ చేస్తాడు. అలా చేసిన వెంటనే అమ్మాయి శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారిపోతుంది. అమ్మాయి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టే చేస్తాడు సైకో కిల్లర్. దీంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఈ విషయం ముంబయిలో అడిషనల్ డీజీపీ ధృవ కుమార్ దృష్టికి వస్తుంది. గతంలో తన కూతురు కూడా ఇలాగే దారుణ హత్యకు గురి కావడంతో ఈ కేసును పర్సనల్‌గా తీసుకుంటాడు ధృవ. అయితే విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈ హత్యలు చేస్తుందెవరు? ఎందుకు ఇలా ఇంజెక్షన్‌తో చంపుతున్నారు? ధ్రువ కూతురికి ఈ మర్డర్స్‌కు సంబంధం ఏంటి? చివరకు క్రిమినల్స్ ను ధృవ ఎలా పట్టుకున్నాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఈ మూవీ కూడా ఒకటి. ఆద్యంతం ట్విస్టులు, సస్పెన్స్‌తో ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు. ఈ సినిమా పేరు మార్గాన్. లియో జాన్ పాల్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో విజయ్ ఆంటోని హీరోగా నటించాడు. అలాగే అజయ్ దిషాన్, సముద్రఖని, మహానంది శంకర్, బ్రిగడ సాగా, వినోద్ సాగా, ప్రీతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. ప్రస్తుతం ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అందుబాటులో ఉంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

మార్గాన్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us