
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన ‘ద ఒడిస్సీ’తో పాటు క్రేజీ కళ్యాణం, హైకూ, అనుమాన పక్షి, 418, అన్బిల్ అవన్, అనుమాన పక్షి తదతర సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ లిస్టులో ఉన్నాయి. అయితే అంతకంటే ముందే ఓ బ్లాక్ బస్టర్ మూవీ మంగళవారం (నవంబర్ 17) సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. ప్రస్తుతం ట్రెండ్ అయిన పాన్ ఇండియా సినిమా కూడా కాదు. వీఎఫ్‌ఎక్స్ హంగులు, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లు, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా లేవు. భారీ బడ్జెట్ సినిమా కూడా కాదాయే.. కానీ కేవలం కంటెంట్ తోనే కోట్ల రూపాయలు రాబట్టిందీ సినిమా. చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైనా టాక్సిక్ వంటి సినిమాలను సైతం అధిగమించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కుమారుడు సంతోష్‌ను (శ్రీరామ్) అల్లారుముద్దుగా పెంచుతాడు. వ్యవసాయం చేసుకునే సంతోష్‌ను చూసి మరదలు వసంత (రమిక శివు) మనసు పడుతుంది. కానీ తండ్రి మాత్రం కొడుక్కి బాగా చదువుకున్న పిల్లను భార్యగా తేవాలని కలలు కంటాడు.
అదే సమయంలో విదేశాల నుంచి వచ్చి ప్రేమలో మోసపోయిన రుక్మిణి (తపస్విని పూనాచ)ని చూసి సంతోష్ ప్రేమలో పడతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ స్నేహితుడి కూతుర్ని పెళ్లి చేసుకోమని తండ్రి సంతోష్‌ను కోరతాడు. మరి తండ్రి పరువు నిలపడం కోసం సంతోష్ ఆ పెళ్లి చేసుకున్నాడా? తన మనసులోని ప్రేమను వదులుకున్నాడా? ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఏ తీరానికి చేరింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కన్నడలో బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టిన ఈ సినిమా పేరు ‘ప్రేమద ఊరలి’. తెలుగులో ప్రేమనే ఊరిలో పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్, రంగాయన రఘు, రమిక శివు, తపస్విని పూనాచ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడలో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి, చందు శ్రీనివాస్, మమతా దేవేంద్ర తెలుగు ప్రేక్షకులకు అందించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇవాళ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. మన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాను అసలు మిస్ అవ్వొద్దు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి