OTT Movie: నగరంలో వరుస హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అలాగే ఓటీటీ ఆడియెన్స్ కు ఎంతో ఇష్టమైన ఒక మలయాలం సినిమా, అందులోనూ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: నగరంలో వరుస హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Nov 13, 2026 | 9:52 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి, బాంద్రా, దాయిరా, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, కికు చిరంజీవి, పరివారిక్ మనురంజన్ తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అక్టోబర్ 02న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం మలయాళంలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథ కథనాలు, ఉత్కంఠరేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా మలయాళం ఆడియెన్స్ కు బాగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు10కి 7.3 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ నగరంలో జరిగే వరుస అనుమానాస్పద హత్యల చుట్టూ ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. మొదట నగరంలో డ్రగ్స్ వ్యాపారం చేసే జస్టిన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే వ్యాపారవేత్త బోబన్ కూడా అదే తరహాలో దారుణ హత్యకు గురవుతాడు. రెండు హత్యలు ఒకే పద్ధతిలో జరగడంతో పోలీసులకు అనుమానాలు మొదలవుతాయి. ఈ సీరియల్ మర్డర్ మిస్టరీని ఛేదించే బాధ్యతను DYSP క్రిస్టీకి అప్పగిస్తారు. అయితే విచారణలో ఆయనకు పెద్దగా ఆధారాలేమీ లభించవు. దీంతో సైకో పాత్స్, సీరియల్ కిల్లర్స్ మనస్తత్వాలను విశ్లేషించడంలో నేర్పరి అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ స్వామి సహాయాన్ని క్రిస్టీ తీసుకుంటాడు. మరి ఆ ఇద్దరినీ చంపిన కిల్లర్ ఎవరు? అసలు ఆ మర్డర్స్ వెనక ఉన్న మోటివ్ ఏంటి? మూడో హత్య జరగకుండా పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా మిగతా కథ.

ఇవాళే ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది థర్డ్ మర్డర్’ (The Third Murder). దర్శకుడు సునీల్ ఇబ్రహీం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్‌లతో పాటు అనన్య, మణికందన్ పటాంబి, లియోనా లిషాయ్ తదితర నటీనటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ్టి (నవంబర్ 13) నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ‘మనోరమ మ్యాక్స్’, ‘సింప్లీ సౌత్’ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ఆడయో కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ది థర్డ్ మర్డర్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ది థర్డ్ మర్డర్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us