OTT Movie: రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలే టార్గెట్.. OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఓటీటీలో మంచి ట్విస్ట్ లున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ కానీ వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్. నగరంలో నవ వధువలను, అందులోనూ రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలను చంపే సైకో కిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.

OTT Movie: రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలే టార్గెట్.. OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT Movie

Updated on: Nov 18, 2026 | 6:53 AM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. ఇప్పటికే ది ఒడిస్సీ, ప్రేమదే ఊరళి (తెలుగులో ప్రేమనే ఊరిలో) సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటితో పాటు అనుపమ క్రేజీ కళ్యాణం, హైకూ, అనుమాన పక్షి, 418, అన్బిల్ అవన్, అనుమాన పక్షి తదితర సినిమాలు ఈ వీకెండ్ లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి సంగతి పక్కన పెడితే.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ కు మెంటలెక్కిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరమైన కథ కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.. కోల్‌కతాలో చిత్రా బసు (సందీప్తా సేన్) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉద్యోగం చేయడం అత్త మామలకు అసలు ఇష్టం ఉండదు. అయినప్పటికీ భర్త సపోర్ట్ తో తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే చిత్రాకు వ్యక్తిగతంగా పలు సమస్యలు ఉంటాయి. ఓ వైపు బాల్యంలో జరిగిన సంఘటన ఆమెను వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు పై అధికారులు కూడా ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో వరుసగా వింత మరణాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ముహూర్తానికి ముందే వధువులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. చిత్రా విచారణలో రెండో పెళ్లి చేసుకుంటున్న యువతులే ఈ హత్యలకు గురవుతున్నారని తెలుసుకుంటుంది. మరి అసలు ఈ హత్యలు చేస్తున్నదెవరు? రెండో పెళ్లి చేసుకునే యువతులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతడిని పట్టుకునే క్రమంలో చిత్రా బసుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ సిరీస్ చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సిరీస్ పేరు ‘మేడమ్ ఇన్ స్పెక్టర్’. బెంగాలీలో కొంతకాలం క్రితం ‘బీరాంగన’ (వీరాంగన) అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ రూపొందింది. అదే సిరీస్ ను ఇప్పుడు ‘మేడమ్ ఇన్ స్పెక్టర్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడీ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బెంగాలితో పాటు ఇప్పుడు తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. నిర్ఝర్ మిత్రా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో సందీప్తా సేన్ (ఇన్స్పెక్టర్చిత్రా బసుగా), నిరంజన్ మండల్, ప్రతీక్ దత్తా, ఆదిత్య సేన్‌గుప్త తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం 7 ఎపిసోడ్స్ ఈ సిరీస్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us