Cinema : భయానికి కేరాఫ్ అడ్రస్.. ఒక్కో ట్విస్టుతో వణుకుపుట్టిస్తోన్న సినిమా.. అయినా ఎగబడి మరీ చూస్తున్నారు..

ఓటీటీలో ఈమధ్యకాలంలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఊహించని విధంగా అత్యధిక వ్యూస్ అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జనాలకు వణుకుపుట్టిస్తోంది. అయినా ఎగబడి మరీ చూస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : భయానికి కేరాఫ్ అడ్రస్.. ఒక్కో ట్విస్టుతో వణుకుపుట్టిస్తోన్న సినిమా.. అయినా ఎగబడి మరీ చూస్తున్నారు..
Mammootty Kalamkaval Film

Updated on: Nov 18, 2026 | 12:46 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ ముమ్ముట్టి. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అంతేకాదు కేవలం యాక్షన్ డ్రామాలే కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలు ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఆయన నటించిన ఓ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘కళంగావల్’ (Kalamkaval)తో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న సీరియల్ కిల్లర్ ‘స్టాన్లీ దాస్’ పాత్రలో కనిపించి సంచలనం సృష్టించారు. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

మమ్ముట్టి నిర్మాణ సంస్థ ‘మమ్ముట్టి కంపెనీ’ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో మరో టాలెంటెడ్ నటుడు వినాయకన్ పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించారు. కథాంశం పరంగా ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేసే స్క్రీన్ ప్లే ఈ సినిమా ప్రధాన బలం. థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, మమ్ముట్టి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సినిమాలో మమ్ముట్టి అభినయం, వినాయకన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని సినీ విమర్శకులు ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ‘కళంగావల్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోన్ లివ్’ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సోన్ లివ్ ఓటీటీలో దుమ్మురేపుతుంది. కేవలం మలయాళం మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషలలో కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందుబాటులో ఉండటంతో ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులకు ఇది చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us