
ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కిష్కింద కాండం, రేఖా చిత్రం, సూక్ష్మ దర్శిని, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, డైస్ ఇరే, తుడరుమ్, డొమినిక్ అండ్ లేడీస్ పర్స్.. ఇలా చాలా మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. మూవీ చూస్తున్నంత సేపూ హంతకుడెవరన్న సంగతి గెస్ చేయలేని పరిస్థితి. థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోనూ ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాలో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన పుట్టిన రోజునే దారుణంగా హత్య కు గురవుతాడు. ఒక సైకో కిల్లర్ ఈ మర్డర్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే చాలామంది సైకో కిల్లర్ చేతిలో ప్రాణాలు కోల్పోతారు. దీంతో అతనికి బర్త్ డే కిల్లర్ అని పేరు పెడతారు. ఎందుకంటే కిల్లర్ బాధితులను వారి పుట్టినరోజునే హత్య చేసి, కొన్ని ఆనవాళ్లు కూడా వదిలి వెళతాడు. మరి ఈ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? అబ్రహం ఓజ్లర్ ఆ సైకో కిల్లర్ ను పట్టుకున్నాడా?లేదా? తెలియాలటే ఈ మూవీని చూడాల్సిందే
పరుగులు పెట్టించే కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు అబ్రహం ఓజ్లర్. 2024లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో అల వైకుంఠపురం మూవీ ఫేమ్ జయరాం పోలీసాఫీసర్ రోల్ పోషిస్తే, స్టార్ నటుడు మెగాస్టార్ మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నటించడం విశేషం. వీరితో పాటు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్, అర్జున్ అశోకన్, అర్జున్ కురియన్, అనీష్ గోపాల్, శ్రీరామ్ రామచంద్రన్, అనూప్ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మిథున్ మాన్యువల్ థామస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.