AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మనిషి శరీరం, గుర్రపు కాళ్లతో భయపెట్టే వింత జీవి.. ఓటీటీలో మరో మలయాళం సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ..

ఇప్పుడు ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషలో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ మలయాళం హారర్ మూవీస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: మనిషి శరీరం, గుర్రపు కాళ్లతో భయపెట్టే వింత జీవి.. ఓటీటీలో మరో మలయాళం సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 05, 2026 | 8:44 PM

Share

ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సర్వం మాయ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో కేవలం మలయాళం వెర్షన్ రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ తో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి మరో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడి ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు కడుపుబ్బా నవ్వించింది. సస్పెన్స్, హారర్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ కూడా ఉండడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక గ్రామంలోకి అకస్మాత్తుగా ఒక వింత జీవి సంచరించడం మొదలవుతుంది. దానిని చూసిన వారందరూ వణికిపోతుంటారు. ఎందుకంటే ఆ జీవికి మనిషి శరీరం, గుర్రపు కాళ్లు ఉంటాయి. ఊరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేలా చేసిన ఆ వింత జీవి గురించి హీరో (శ్యామ్) అనే యువకుడు ప్రయత్నిస్తాడు. మరి ఈ వింత జీవి ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతూ కడుపుబ్బా నవ్వించే ఈ మూవీ పేరు నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’ (Nellikkampoyil Night Riders). ‘లియో’ మూవీ ఫేమ్ మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో నటించాడు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 06) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట. ఓటీటీప్లే ఓటీటీలోనూ ప్రీమియం ద్వారా కూడా ఈ సూపర్ హిట్ మూవీని చూడొచ్చు. అయితే ఈ మూవ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంటుందా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ మాత్రం అందుబాటులో ఉండనున్నాయి.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

ప్రస్తుతం మలయాళం సినిమాలన్నీ తెలుగు  వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కాబట్టి ఈ మూవీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు