
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర ప్రధాన భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి.
అఖిల్ అక్కినేని లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వీకెండ్ లోనే ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళం సినిమానే అయినప్పటికీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండడంతో ఈ మూవీకి భారీగా వ్యూయర్ షిప్ వస్తోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. కథ విషయానికి వస్తే.. కుటుంబంలో ఓ చిన్న వివాదం… చినికి చినికి గాలివానలా మారి ఓ యువతి హత్యకు దారి తీస్తుంది. ప్రముఖ వ్యాపారి కుటుంబంలో జరిగిన ఈ ఘటన నగరంలోనే సంచలనం సృష్టిస్తుంది. పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకదు. చివరకు ఈ మర్డర్ మిస్టరీ కేసును పరిష్కరించే బాధ్యతలను ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారికి అప్పగిస్తారు. విచారణ ముందుకు సాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి.
హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులు, బాయ్ ఫ్రెండ్, ఇంట్లో పని వాళ్ల అందరివీ సీక్రెట్స్ బయటపడతాయి. ఇదే సమయంలో పోలీసులకు మరో చిక్కుముడి ఎదరవుతుంది. మరి చివరికి ఆ యువతిని చంపింది ఎవరు అనేది తెలిసిందా ? హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ? హంతకుడు పోలీసులను ఎలా తప్పుదారి పట్టించాడు ? అసలు ఆ క్రిమినల్ ఎవరన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
A tale of faith, mystery, and unexpected truths awaits.
Watch Paithalattam now on Sun NXT.@sreejith.lal.39 @advmnavas @vibinnvelayudhan @leela_L_girishkuttan
[Paithalattam, Malayalam Movie, Sun NXT Exclusive, Mystery Thriller, Ritual, Sacred Legacy, Theyyam, Suspense,… pic.twitter.com/VyGi5rQx1f
— SUN NXT (@sunnxt) July 31, 2026
ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోన్న ఈ సినిమా పేరు పైథలాట్టం (Paithalattam). థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. విబిన్ ఎన్ వేలాయుధన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ధన్య అనన్య, జయన్ చేర్తాల, మిథున్ చంబు, సునీల్ సుఖద తదితరులు కీలకపాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి