OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన

ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాను స్వయంగా నిర్మించడం విశేషం.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన
OTT Movie

Updated on: May 07, 2026 | 11:33 AM

హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడతను నిర్మాతగా మారాడు. కొత్త వారిని పరిచయం చేస్తూ కిరణ్ స్వయంగా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. వి. మునిరాజ్ తెరకెక్కించిన ఈ రూరల్ కామెడీ ఎంటర్ టైనర్ లో సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్, పోస్టర్స్ తో నే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైంది. ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తిమ్మరాజుపల్లి టీవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మే 15 నుంచి తిమ్మరాజు పల్లి సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది .. ‘మిస్ అయిన టీవీ.. ఒక దొంగ.. నిజం కోసం వేచి చూసే గ్రామస్తులు’.. తిమ్మరాజు పల్లి మే 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది’ అని ఆహా పేర్కొంది. అయితే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌, బాలరాజు, సాయికృష్ణ, అనిల్, తేజ విహాన్, టీవీ రామన్, చిట్టిబాబు, ప్రతాప్ రెడ్డి, మాధవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ బ్యానర్లపై కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. వంశీకాంత్ రేఖన సంగీతం సమకూర్చారు. మరి థియేటర్లలో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో కిరణ్ అబ్బవరం తిమ్మరాజుపల్లి టీవీ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us