AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన సినిమా

రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ధురంధర్ ది రివేంజ్ లాంటి బ్లాక్ బస్టర్ ను తట్టుకుని మరీ ఈ సినిమా నిలబడింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి మరీ చూశారు.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 12, 2026 | 12:17 PM

Share

ఈ వారం ఓటీటీలో బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చాయి. రాధిక శరత్ కుమార్ తాయ్ కిళవి, ఆది పిని శెట్టి శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై, త్రాష్ తదితర సినిమాలు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. అందుకే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక అమ్మాయినైనా ప్రేమించాలనుకునే టీనేజర్ లైఫ్ లోకి ముగ్గురు అమ్మాయిలు వస్తే ఏం జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రవీణ్ మాత్రం స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కరినైనా ప్రేమించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ అతని జీవితంలోకి గంగవల్లి (అనీషా), ప్రేషిక (మీనాక్షి), సోనాల్ (ప్రియాన్షి) వస్తారు. ప్రవీణ్ కు ప్రేషిక, సోనాల్ బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత గంగవల్లితో లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు ప్రవీణ్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చివరకు ఏం జరిగింది? అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన ఈ సినిమా పేరు యూత్. కెన్ కరుణాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు. అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ తదితరులు నటించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16 నుంచి ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ యూత్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో యూత్ సినిమా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
రామాయణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్
రామాయణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్
ఓటీటీలో పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మహాదేవుని త్రిశూలంలోని మూడు కొమ్ముల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక..
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?