OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ కాంట్రవర్సీ మూవీ.. బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్ జెండర్ అయితే..

ఇటీవల కాలంలో ఇలాంటి సబ్జెక్టుతో సినిమా రాలేదు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను చూసి ఆడియెన్స్ నోరెళ్ల బెట్టారు. ఇదేం స్టోరీరా బాబూ.. అంటూ డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ కు అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో ఈ సినిమాపై వివాదాలు కూడా తలెత్తాయి. చివరకు సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ కాంట్రవర్సీ మూవీ.. బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్ జెండర్ అయితే..
OTT Movie

Updated on: Oct 23, 2026 | 6:40 AM

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘డోరతి’. తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు మరోసారి ఒక విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రిషికాంత్‌, సనంత్‌ హీరోలుగా నటించారు. ట్రాన్స్‌జెండర్, LGBTQ+ వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ డోరతి సినిమా సెప్టెంబర్ 25న తమిళంలో విడుదలైంది. అక్కడ సూపర్ హిట్ టాక్ రావడంతో ఒక వారం ఆలస్యంగా అక్టోబర్ 02న తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. స్పిరిట్‌ మీడియా ద్వారా హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి సబ్జెక్టుతో సినిమా రాలేదు. ఎందుకంటే ఈ సినిమా కథ, కథనం చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే వీటిపై వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికీ డోరతి సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా తలెత్తాయి. అయితే ఇన్నీ వివాదాల మధ్య కూడా డోరతి సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం డోరతి సినిమాను చూసి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలా మొత్తానికి కాంట్రవర్సీతోనే కలెక్షన్లు రాబట్టిన డోరతి సినిమా నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది.

డోరతి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఇదివరకే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో డోరతి సినిమా..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. డోరతి అంటే తెలుగులో దేవుడు ఇచ్చిన కానుక అని అర్థం. 1980ల నాటి కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇద్దరు బాల్య మిత్రుల జీవితాల్లోకి ఒక మహిళ ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది డోరతి సినిమా ప్రధాన కథాంశం. సమాజంలో ఒక ట్రాన్స్‌జెండర్ ఎదుర్కొన్న సవాళ్లను, సమాజం వారి పట్ల చూపించే వైఖరిని హృద్యంగా ఆవిష్కరించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న డోరతి సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

డోరతి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us