
ప్రస్తుతం థియేటర్లయినా, ఓటీటీలైనా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రతి వారం ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇతర భాషల్లో హిట్ అయిన వాటిని కూడా ఆయా భాషల్లోకి డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా ఈ వారం కూడా ఇక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో ఏడు ఎపిసోడ్స్ ఉన్న రాక్షస వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సినిమా చూసిన వారందరూ ఐఎమ్ డీబీలో ఏకంగా 9.8 రేటింగ్ ఇచ్చి టాప్‌లో ఉంచారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక మొసలి, ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ సాగుతుంది. నది ఒడ్డున ఉండే గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతాయి. వీటిని సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా, లేదా మొసలి చంపుతుందా? అనేది చివరి వరకు తెలియకుండా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అదే సమయంలో సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్ లో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. మరి వారంతా ఏమయ్యారు? అసలు ఎలాంటి ఆనవాళ్లు, గుర్తులు లేకుండా వారు ఎలా మాయమయ్యారు? ఇది నిజంగా మొసలి దాడివల్ల జరుగుతుందా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? మరి పోలీసులు ఈ క్రైమ్ మిస్టరీని ఎలా ఛేదించారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
2022లో వచ్చిన సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్ ‘విలంగు’ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించచారు. హిందీలో కూడా ఇది ‘జానవర్’ పేరుతో ఇది రీమేక్ అయ్యింది. ఇప్పుడు కన్నడలో ‘రాక్షస’గా వచ్చింది. సుహాన్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి, అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజిత్, హులుగప్ప కత్తిమని, మహాదేవ్ హడాపద్, సుష్మిత జగప్ప తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం కేవలం కన్నడలో మాత్రమే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీకెండ్ లో మంచి థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ಸತ್ಯದ ಹುಡುಕಾಟದಲ್ಲಿ ಅಡಗಿದೆ ಭಯಾನಕ ರಹಸ್ಯ
ಉತ್ತರ ಕರ್ನಾಟಕದ ಮೊಟ್ಟಮೊದಲ ವೆಬ್ ಸೀರಿಸ್ ‘ರಾಕ್ಷಸ’ ಈಗಲೇ ನೋಡಿ ನಿಮ್ಮ ಕನ್ನಡ Zee5ನಲ್ಲಿ
Watch Here: https://t.co/JQ4CsEe97M
Produced By: @tskreatiivez
Producer: @TharunSudhir#VijayRaghavendra @MayuriKyatari #AppannaRamadurga#AvinashYelandur pic.twitter.com/iJ53UZJdk9— ZEE5 Kannada (@ZEE5Kannada) February 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.