
ఓటీటీ వేదికగా వచ్చే నిజ జీవిత క్రైమ్ కథలు , సంచలన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కే వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. అలాంటి వాటిలో భారతదేశాన్ని కుదిపేసిన అత్యంత భయంకరమైన యథార్థ ఘటన ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్‌రూమ్. ఈ ఒళ్లు గగుర్పొడిచే నిజ కథ మహారాష్ట్రకు చెందినది, దీనిపై మూడు భాగాల డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కూడా రూపొందించబడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ మూడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, ఆలోచింపజేసేలా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ 2022లో విడుదలైంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని జరిగిన ఒక వాస్తవిక సంఘటన ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అప్పట్లో ఆ ప్రాంతంలో అగ్గు యాదవ్ అనే గ్యాంగ్‌స్టర్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. స్థానికంగా నివసించే వందలాది మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు చేస్తూ ఆ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టించాడు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, రాజకీయ , పోలీసుల అండదండలతో అతను చట్టం నుంచి తప్పించుకుంటూ తన అరాచకాలను కొనసాగించాడు. పోలీసులు మరియు చట్టం నుంచి తమకు ఎలాంటి న్యాయం జరగదని గ్రహించిన బాధిత మహిళలు, నిస్సహాయ స్థితిలో తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. 2004 ఆగస్టు 13న అగ్గు యాదవ్‌ను విచారణ నిమిత్తం నాగ్‌పూర్ జిల్లా కోర్టులోని రూమ్ నంబర్ 7కి తీసుకొచ్చినప్పుడు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అతని చేతుల్లో అఘాయిత్యాలకు గురైన సుమారు 200 మందికి పైగా మహిళలు ఒక్కసారిగా కోర్టు హాల్లోకి చొరబడి, అక్కడే అందరి సమక్షంలో అతనిని అతి కిరాతకంగా హతమార్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
ఈ సంచలన హత్య అనంతరం “ఆ నరాధముడిని చంపింది ఎవరు?” అనే ప్రశ్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వందలాది మంది మహిళలు తామే చంపేశామని ముందుకు రావడం పోలీసులకే సవాల్‌గా మారింది. ఈ మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌లో స్థానిక మహిళల ఇంటర్వ్యూలు, జర్నలిస్టులు అందించిన సాక్ష్యాలు, పోలీసుల వాదనలు, కోర్టు రికార్డులను అత్యంత ఆసక్తికరంగా చూపించారు. చట్టం రక్షించలేని చోట బాధితులే తమను తాము ఎలా రక్షించుకున్నారు అనే అంశాన్ని ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఈ సిరీస్‌కు ఉమేష్ వినాయక్ కులకర్ణి దర్శకత్వం వహించారు. హిందీ, మరాఠీ , ఇతర భాషలలో డబ్బింగ్ వెర్షన్లు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..