
నో కామా.. నో ఫుల్ స్టాప్. ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. ఇదే ఇప్పుడు బిగ్‌బాస్ ఓటీటీ (Bigg Boss OTT) ట్యాగ్ లైన్. ఇకపై కేవలం గంట మాత్రమే కాకుండా.. 24 గంటలు వినోదాన్ని అందించనుంది బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు. ఇప్పటికీ ఓటీటీ లోగో ప్రోమో రిలీజ్ చేస్తూ.. ఈనెల 26 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ షో ప్రారంభం కాబోతుందంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 26న నుంచి ప్రసారం కానుంది. ఇక గత సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఈ ఓటీటీ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ షో ఈనెలలోనే ప్రారంభం కాబోతుందని తెలిసినప్పటి నుంచి ఇందులో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలోని పలువురు కంటెస్టెంట్స్‌తోపాటు.. సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారు కూడా పాల్గోనపోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఓటీటీ షో తెలుగు రేపటి నుంచి ప్రసారం కాబోతుందని తెలియజేస్తూ.. ఓ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అందులో బిగ్‌బాస్ ఓటీటీ కొత్తింటిని చూపించారు. కొత్తింటిని నాగార్జున కూర్చుని.. ఇక పై బిగ్‌బాస్ గంట మాత్రమే చూశారు.. ఇప్పుడు గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ చెప్పుకొచ్చాడు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్ ఓటీటీ ఇంటిని విభిన్నంగా..సరికొత్తగా కలర్ఫుల్గా డిసైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ షో రేపు (ఫిబ్రవరి 26న) సాయంత్రం 6 గంటలు స్ట్రీమింగ్ కానుట్లుగా ప్రకటించారు నిర్వాహకులు. మొత్తానికి బిగ్‌బాస్ ఓటీటీపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
ఇక ఇందులో పాల్గోనబోయే కంటెస్టెంట్స్‌ను సెలక్ట్ చేశారని.. వారిని క్వారంటైన్లో ఉంచారని సమాచారం. యాంకర్ స్రవంతి, ఆవకాయ సినిమా హీరోయిన్ బింధుమాధవి.. యాంకర్ శివ ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ కంటెస్టెంట్స్‌గా అందులో ధనరాజ్, ముమైత్ ఖాన్.. తనీష్, ఆదర్శ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, సరయూ, హమీదా, నటరాజ్ మాసర్ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ గా పాల్గోనబోతున్నట్లుగా టాక్.
Also Read: Bheemla Nayak Review: సమ్మర్ సినిమాలకు శుభారంభం.. భీమ్లా నాయక్.. పర్ఫెక్ట్ మూవీ రివ్యూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. ఏమన్నారంటే..
Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా