OTT Movie: ప్రియురాలు సైకోగా మారితే.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది

ఓటీటీ ఆడియెన్స్ నిరీక్షణకు తెరపడింది. వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఆడియెన్స్ కోసం ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరెందుకు లేటు.. వెంటనే ఈ సినిమాను చూసేయండి.

OTT Movie: ప్రియురాలు సైకోగా మారితే.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది
Obsession Movie

Updated on: Nov 13, 2026 | 6:32 PM

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి, బాంద్రా, దాయిరా, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, కికు చిరంజీవి, పరివారిక్ మనురంజన్ తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటితో పాటు ఓటీటీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఒక బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమా కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఇదే అతి పెద్ద సంచలనం. ఎందుకంటే ఈ మూవీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ లేరు. వీఎఫ్ ఎక్స్ గ్రాఫిక్సులు, యాక్షన్ సీక్వెన్సులు లేవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. పైగా భారీ బడ్జెట్ సినిమా కూడా కాదాయే. జస్ట్ రూ. 7 కోట్లతో మాత్రమే సినిమా తీశారు. కానీ కేవలం కంటెంట్ తోనే ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ సినిమాలకు సంబంధించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. చిన్న సినిమా ట్యాగ్ తోనే రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.4000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అందులోనూ ఒక్క ఇండియాలోనే దాదాపు రూ.77 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ ను గడగడలాడించిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాల్లో ‘అబ్సెషన్’ ఒకటి. ఈ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీని కర్రీ బార్కర్ అనే యూట్యూబర్ తెరకెక్కించడం విశేషం. మైఖేల్‌ జాన్‌స్టన్‌ ,ఇండీ నవరెట్టే ప్రధాన పాత్రలు పోషించారు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను ప్రేమలో పడేయాలనే ఒక యువకుడి ఆరాటం ఎలాంటి భయానక పరిణామాలకు దారితీసింది అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ సాధించిన ‘అబ్సెషన్’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. తాజాగా మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జియో హాట్ స్టార్‌లో ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అబ్సెషన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో అబ్సెషన్ తెలుగు వెర్షన్..

అబ్సెషన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us