Kayadu Lohar: ఓటీటీలోకి కయాదు లోహర్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో అలరిస్తున్న జీవీ ప్రకాశ్‌ అటు హీరోగానూ మెప్పిస్తున్నాడు. తాజాగా హీరోయిన్ కయాదు లోహర్‌ జోడిగా ఆయన నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ఇమ్మోర్టల్‌’ . డైరెక్టర్ మారియప్పన్ చిన్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది. అసలు విషయాలు తెలుసుకుందామా..

Kayadu Lohar: ఓటీటీలోకి కయాదు లోహర్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Immortal

Updated on: Oct 23, 2026 | 7:21 PM

టాలీవుడ్ ,కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, హీరోగానూ వరుస వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నారు జీవీ ప్రకాశ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఇమ్మోర్టల్’. ‘నాకు మరణం లేదు’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మారియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ అధికారికంగా బయటికి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను భయపెడుతూనే మరోవైపు రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్న ‘ఇమ్మోర్టల్’ సినిమా త్వరలోనే ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్ వేదికగా ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ అందుబాటులోకి రానుండటంతో హారర్ జోనర్ ఇష్టపడే సినీ ప్రియులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ కథానాయికగా నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

కథ విషయానికి వస్తే..

మహి (జీవీ ప్రకాశ్) అనే సాధారణ యువకుడు తన ఉద్యోగ రీత్యా తక్కువ అద్దెలో ఇల్లు వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో సింధు (కయాదు లోహర్) అనే యువతితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే షేరింగ్ ఫ్లాట్‌లో మహి అద్దెకు దిగుతాడు. తొలిచూపులోనే సింధుతో ప్రేమలో పడిన మహి జీవితంలో కొన్ని ఊహించని వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి. అసలు సింధు ఎవరు? ఆమె వెనుక ఉన్న వెయ్యేళ్ల నాటి జానపద మిస్టరీ ఏంటి? ఆ అపార్ట్‌మెంట్‌లోని భయానక రహస్యాల నుంచి మహి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..

 

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

Loading...
Unable to load recommendations.
Follow Us