OTT Movie : ఓటీటీలోకి ధనుష్ లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్రస్తుతం ఓటీటీలోకి కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కేవలం 45 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన లేటేస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలు తెలుసుకుందామా.

OTT Movie : ఓటీటీలోకి ధనుష్ లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Kara Movie

Updated on: May 23, 2026 | 10:44 AM

కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమాలకు దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అటు తమిళం, తెలుగు భాషలలోనే కాకుండా ఇటు హిందీలోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన లేటేస్ట్ హిట్ మూవీ కర. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ హెయిస్ట్ థ్రిల్లర్‌కు ఆల్ఫ్రెడ్ ప్రకాష్ రచన కూడా అందించారు. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో తమిళనాడులో ఇంధన సంక్షోభం తలెత్తడంతో, ధనుష్ అలియాస్ కరసామి (అ) కర అనే ఒక దొంగ తన జీవనోపాధి కోసం పోరాడవలసి రావడమే ఈ సినిమా కథ. ఎంతో అంచనాల మధ్య ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక, ప్రపంచవ్యాప్తంగా కేవలం సుమారు రూ. 41 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మే 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ (Netflix) యాప్‌లో దీని స్ట్రీమింగ్‌ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇందులో మమితా బైజు , కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ రాజన్, సూరజ్ వెంజరమూడు, ఎంఎస్ భాస్కర్, శ్రీజ రవి , పృథ్వీ పాండియరాజన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళ, తెలుగుతో సహా పలు భాషల్లో అందుబాటులో స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

కథ విషయానికి వస్తే.. కరస్వామి (ధనుష్) ఒక దొంగ. అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమిత బైజు) కోసం తన నేర జీవితాన్ని వదిలేసి కష్టపడి బతకాలని నిర్ణయించుకుంటాడు. ఒక హోటల్ పెట్టడానికి ఊరిలో ఉన్న పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. ఆ కాగితాల కోసమే చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి (కేఎస్ రవికుమార్) వద్దకు వెళతాడు. కానీ అనుకోకుండా తన తండ్రిని కోల్పోతాడు. తర్వాత కరస్వామి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటీ.. ? తన జీవితంలోకి ముత్తు సెల్వన్ (జయరామ్ ) ఎలా వచ్చాడు అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

Follow Us