
గత కొన్నాళ్లుగా ఓటీటీలలో వైవిధ్యమైన, హృదయానికి హత్తుకునే కథా చిత్రాలు దూసుకుపోతున్నాయి. మనసులలో నిలిచిపోయే సినిమాలకు డిజిటల్ మూవీ లవర్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘దీవానా’ (Deewana)కి మంచి రెస్పాన్స్ వస్తుంది. జూలై 31న అధికారికంగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు డిజిటల్ స్పేస్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
ఇదిలా ఉంటే దీవానా సినిమా ఆహాలో క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో ఏకంగా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి, 2026 నాటి బిగ్గెస్ట్ సూపర్‌హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు రెండు భాషల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే సంభాషణలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నేటితరం ప్రేమకథల్లో ఉండే భావోద్వేగాలను, ఎదురయ్యే సంఘర్షణలను దర్శకుడు ఎంతో సహజంగా, అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. ప్రేమలోని మధురానుభూతులను చక్కగా ఆవిష్కరించడంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
ఈ సినిమాలో యంగ్ స్టర్స్ హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేఘలై ప్రధాన పాత్రలలో నటించారు. బాధ్యతలేని ఒక యువకుడిగా ఉన్న మున్నా (హర్షిత్ రెడ్డి) అదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగి అయిన అమూల్య (స్నేహ)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ ప్రేమ మున్నా జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ మూవీ. ప్రస్తుతం ఈ చిత్రానికి కుర్రాళ్లు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..