OTT Movie: ఇదెక్కడి సిరీస్ మావా.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ..

ఓటీటీలోకి ఇప్పుడు సూపర్ హిట్ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇన్నాళ్లు మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతుంది. తాజాగా విడుదలైన ఈ సిరీస్ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇటీవల కోర్టు సినిమాను మించిన ట్విస్టులు.. మర్డర్ మిస్టరీతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.

OTT Movie: ఇదెక్కడి సిరీస్ మావా.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ..
Criminal Justice

Updated on: Apr 29, 2025 | 4:29 PM

ఇటీవల కాలంలో కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్న, తమిళం భాషలలో విడుదలైన కోర్టు రూమ్ చిత్రాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో వచ్చిన కోర్ట్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే ఇటు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తుంది. కోర్టు సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి మరో కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ రాబోతుంది. అదే క్రిమినల్ జస్టిస్. సరిగ్గా ఆరేళ్ల కిందట 2019 ఏప్రిల్ 5న తొలి సీజన్ స్ట్రీమింగ్ కాగా.. అతి తక్కువ సమయంలోనే సూపర్ హిట్ అయ్యింది. దీంతో వెంటనే రెండో సీజన్ తీసుకువచ్చారు. ఇక వరుసగా మూడు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు నాలుగో సీజన్ తీసుకువస్తున్నారు.

ఇప్పుడు రాబోతున్న నాలుగో సీజన్ మే 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ఈ సీజన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే లాయర్ మాధవ్ మిశ్రా పాత్రలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ సరికొత్త కేసుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత మూడు సీజన్స్ మాదిరిగానే ఇప్పుడు రాబోతున్న నాలుగో సీజన్ లోనూ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కోర్ట్ రూమ్ డ్రామా సైతం ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

టీజర్ విషయానికి వస్తే.. క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ ఓ జంట ప్రేమ, హత్య చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ముందు మూడు సీజన్స్ మాదిరిగానే ఈసారి సైతం మాధవ్ మిశ్రా పాత్రలో పంకజ్ త్రిపాఠి కొత్తగా హత్య కేసుతో రాబోతున్నారు. ఓ అమ్మాయి హత్య, కోర్టు రూమ్ వాదనలు చాలా ఇంటెన్స్ ఈ టీజర్ లో కనిపిస్తాయి. ఎప్పటిలాగే ఈసారి సైతం ఎత్తులు, పై ఎత్తుల ద్వారా కోర్డు డ్రామా ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..