AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్ 3’ ప్రీమియర్స్‌లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే?

'సేవ్‌ ది టైగర్స్' వెబ్‌ సిరీస్‌ ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్‌ అయ్యింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడీ నవ్వులను మూడింతలు చేసేందుకు ఈ కామెడీ సిరీస్ మూడో సీజన్ కూడా వచ్చేస్తోంది. తాజాగా దీని ప్రీమియర్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

Save The Tigers 3: 'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే?
Save The Tigers 3
Basha Shek
|

Updated on: Jun 16, 2026 | 5:50 PM

Share

సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌రు కాగా.. వారి న‌వ్వుల‌తో, సంద‌డితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది. అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు క్రియేటర్లు.. ఇలా అంద‌రూ క‌లిసి ప్రాంతీయ OTT వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగ‌ర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వ‌చ్చిన సీజ‌న్‌3ను ఎంజాయ్ చేశారు. తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, అలాగే ప్రీ స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్.. ఇలా అన్నీ క‌లిసి ఈ స్ట్రీమింగ్ ప్రారంభానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి.

సేవ్ ది టైగ‌ర్స్ 3 స్పెష‌ల్ సెల‌బ్రిటీ ప్రీమియ‌ర్ వేడుక‌లో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మాన‌స్ స‌హా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రీమియ‌ర్‌ను ఎంజాయ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి వంటి నటీనటుల పెర్ఫామెన్స్‌ల‌కు ప్రేక్షకుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మూడు జంటల కథతో పాటు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో వెన్నెల కిషోర్ న‌టించిన ఈ సిరీస్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.

సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్‌3కి కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఇది వ‌ర‌కు మేకర్స్ చెప్పినట్లుగానే, “రెండు ప్రపంచాలు ఢీకొట్టేలా చేసిన గర్జన! దీనిని దేవుడి ప్లాన్ అనాలా, లేక విధి అనాలా!… అందరి దృష్టిని ఆకర్షిస్తూ, పరిస్థితులను తలకిందులు చేస్తూ, ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందేలా టైగర్స్ మళ్లీ వచ్చేశారు. “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.

ఓటీటీల్లో వ్యూయ‌ర్‌షిప్ ప‌రంగా “సేవ్ ది టైగర్స్” అతిపెద్ద తెలుగు వెబ్ సిరీస్‌గా నిలిచింది. మొదటి రెండు సీజన్స్‌లోని కామెడీ, ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. దీంతో సీజ‌న్‌3పై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇప్పుడు ఈ కొత్త సీజ‌న్ స‌రికొత్త ఫ్యాంటసీ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్‌, రోహిణి త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరో రెండు రోజుల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!
మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!