
గత వారం ఓటీటీలోకి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్, వంటి సినిమాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం, మర్మదేశం వంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడ చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓటీటీలోకి వచ్చిన ఒక తెలుగు సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. వైవిధ్యమైన కథాంశంతో, సమాజంలో పెద్దగా ఎవరికీ తెలియని ఒక వృత్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయ్యాడు. సినిమా సూపర్బ్ గా ఉంది ‘వావ్’ అంటూ రివ్యూ కూడా ఇచ్చాడు. ప్రశంసలకు తగ్గట్టుగానే ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జైళ్లలో మరణ శిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసే ‘తలారి’ జీవితం ఎలా ఉంటుంది? ఒక ప్రాణాన్ని తీసేటప్పుడు అతను ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతాడు? ఉరి తీయడానకి అతను ఎలా సంసిద్ధమవుతాడు? అనే ఆసక్తికర అంశాలను ఇందులో చక్కగా చూపించారు డైరెక్టర్. అలాగే తన కుమారుడికి కూడా ఈ తలారి వృత్తిని ఎలా నేర్పించాడన్నది ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.
ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో రన్ అవుతోన్న ఈ సినిమా పేరు హ్యాంగ్ మ్యాన్ (Hang Man). సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అనుకోని కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాని ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మూవీ ట్రెండ్ అవుతోంది. బ్రహ్మాజీతో పాటు బన్నీ అభిరాన్, వినయ్ నల్లకడి తదితరులు కీలకపాత్రలు పోషించారు. విహాన్ దర్శకత్వం వహించారు. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్, డార్క్ హార్స్ విజువల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ప్రస్తుతం హ్యాంగ్ మ్యాన్ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
From gripping suspense to Trending #1! 🔥
#1 and trending on Sun NXT. Watch Hangman now@brahms25 @vihaan_chlorofylmer @udaygurrala @ajay_mysore__ @subhashree.rayagur @kamranzone @anjisaladhi
[Hangman, Sun NXT, Direct to Sun NXT, Vihaan, Thriller, Crime, Mystery, Suspense,… pic.twitter.com/qsSP7gD8Ge
— SUN NXT (@sunnxt) July 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.