OTT Movie: ఇట్స్ అఫీషియల్… ఓటీటీలో ‘అవెంజర్స్ ఎండ్‌ గేమ్’.. తెలుగులోనూ రీసెంట్ విజువల్ వండర్

మార్వెల్ అభిమానులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్... ఓటీటీలో ‘అవెంజర్స్ ఎండ్‌ గేమ్.. తెలుగులోనూ రీసెంట్ విజువల్ వండర్
Avengers Endgame Encore Movie

Updated on: Nov 11, 2026 | 7:19 PM

మార్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన సినిమాలు గ్లోబల్ రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. వేలాది కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాయి. ఇండియాలోనూ మార్వెల్ సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన రీసెంట్ విజువల్ వండర్.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్.. ఎన్ కోర్’. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ చేశారు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ఈ సినిమా ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

కాగా ఇండియాలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (నవంబర్ 13) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ సినిమాను కెవిన్ ఫైజ్ నిర్మించగా, ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఎండ్‌గేమ్ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనమవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతని పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

 

‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమా ట్రైలర్ తెలుగులో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us