Mahesh Babu: మహేష్‌ బాబుకు కలిసొచ్చిన నాగచైతన్య లవ్‌స్టోరీ.. అరుదైన రికార్డు సొంతం..

Mahesh Babu: మహేష్ బాబుకు నాగచైతన్య లవ్‌స్టోరీ కలిసి రావడం ఏంటనీ ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన..

Mahesh Babu: మహేష్‌ బాబుకు కలిసొచ్చిన నాగచైతన్య లవ్‌స్టోరీ.. అరుదైన రికార్డు సొంతం..
Mahesh Babu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 21, 2021 | 6:40 AM

Mahesh Babu: మహేష్ బాబుకు నాగచైతన్య లవ్‌స్టోరీ కలిసి రావడం ఏంటనీ ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. సెప్టెంబర్‌ 24న విడుదలైన ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. శేఖర్‌ కమ్మలు మార్క్‌ డైరెక్షన్‌, సాయిపల్లవి, నాగచైతన్య నటన ఈ సినిమాకు మంచి టాక్‌ను తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లవ్‌స్టోరీ ఒకే థియేటర్‌లో రూ. కోటి రాబట్టి రికార్డు సృష్టించింది. ఆ థియేటర్‌ మరెవరిదో కాదు.. నటుడు మహేశ్‌ బాబుకు చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్‌. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌లో లవ్‌స్టోరీ 251 షోలు వేయగా.. ఏకంగా 48,233 మంది వీక్షించారు. ఇలా ఏఎంబీలో కోటి రూపాయలు వసూళు చేసిన అతి కొన్ని సినిమాల జాబితాలో లవ్‌స్టోరీ చేరింది. సాధారణంగా స్టార్‌ హీరోలకు సంబంధించిన యాక్షన్‌ చిత్రాలే ఈ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతాయి. అలాంటిది తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీ ఈ రెయిర్‌ ఫీట్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే లవ్‌స్టోరీ సినిమా అక్టోబర్‌ 22 సాయంత్రం 6 గంటల నుంచి తొలి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే. మరి థియేటర్లలో అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Health Tips: కోడి గుడ్లతో మరో లాభం కూడా.. అదేంటో తెలిస్తే నమ్మరేమో మరీ..!

Taliban Rule: ఇదీ తాలిబన్ల రాక్షసత్వం.. వాలీబాల్ క్రీడాకారిణిని పొట్టనబెట్టుకున్నారు.. ఎందుకంటే..

Covid-19 Delta variant: బ్రిటన్‌ను మళ్లీ వణికిస్తున్న కరోనా.. మరో వేరియంట్‌ను గుర్తించిన నిపుణులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!